నగ్న ఫొటోలు పంపితేనే రుణం: చైనా కంపెనీ పైత్యం
బీజింగ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ లాంటి దురాగతాలు చైనాలో వెలుగుచూశాయి. విద్యార్థినులు, మహిళలు రుణం కావాలంటే నగ్నంగా ఉండే ఫొటోలు ఇవ్వాలని అక్కడి ఓ కంపెనీ డిమాండ్ చేసింది.
వడ్డీకి రుణం కావాలంటే తప్పనిసరిగా నగ్నఫొటోలు ఇవ్వాలని చాలామంది కాలేజీ విద్యార్థినులను ఆ రుణ సంస్థ అడిగినట్లు ప్రభుత్వ పత్రిక బీజింగ్ యూత్ డైలీ తెలిపింది.

గుర్తింపు కార్డూ ఇవ్వాలని జేడీ క్యాపిటల్స్‌కు చెందిన జీయేదేబావో సంస్థ విద్యార్థులను డిమాండ్ చేసినట్లు పేర్కొంది. అంతేగాక, తీసుకున్న రుణం చెల్లించకపోతే నగ్న ఫొటోలను కుటుంబసభ్యులకు, మిత్రులకు చూపుతామని ఆ సంస్థ బెదిరిస్తోంది.
చిన్న వ్యాపారం చేయాలనుకున్న ఓ యువతి ఆ సంస్థ నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుంది. ఇందుకు ఆమె తన నగ్న ఫొటోలను ఆ సంస్థకు పంపింది. కాగా, నాలుగు నెలల్లో వడ్డీ బాగా పెరిగిపోవడంతో ఆ భారీ మొత్తాన్ని ఆమె చెల్లించలేకపోయింది. దీంతో ఆమె ఫొటోలను అందరికి పంపుతామని బెదిరింపులకు దిగింది. అంతేగాక, వ్యభిచారం చేసేందుకు సిద్ధమేనా? అంటూ ఆమెను వేధించసాగింది. ఈ వివరాలను బాధితురాలు మీడియాకు స్వయంగా తెలిపింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications