ప్రేయసి దొరకలేదని... రోబోను పెళ్లి చేసుకున్నాడు
ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ వ్యక్తి తన ఆశ నెరవేరకపోవడంతో తాను సొంతగా తయారు చేసిన రోబోను వివాహం చేసుకున్న సంఘటన చైనాలో చోటు చేసుకుంది.
బీజింగ్: ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ వ్యక్తి తన ఆశ నెరవేరకపోవడంతో తాను సొంతగా తయారు చేసిన రోబోను వివాహం చేసుకున్న సంఘటన చైనాలో చోటు చేసుకుంది.
చైనాకి చెందిన చెంగ్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎంతో కాలంగా ఓఅమ్మాయి కోసం వెతుకుతున్నాడు. ఎంత వేచి చూసినా అతనికి నచ్చిన అమ్మాయి తారసపడలేదు.

దాంతో విసిగిపోయి ఓ రోబోని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం సొంతంగా ఓ రోబో తయారుచేసుకున్నాడు. దానికి యింగ్ అని పేరుపెట్టాడు. రోబోని పెళ్లి కూతురిలా తయారుచేసి ఓ చిన్న వేడుకలో చెంగ్ రోబోని తల్లిదండ్రులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications