డైపర్స్‌తో ప్రియుడి ప్రపోజ్, చూసి షాకైన ప్రియురాలు

బీజింగ్: వజ్రాల ఉంగరం లేదా బంగారు ఆభరణాలు లేదా మరేదైనా ఇష్టమైన వస్తువును నేరుగా ఇచ్చి ఏ ప్రేమికుడైనా ప్రియురాలికి ప్రపోజ్ చేస్తాడు. కానీ చైనాలోని ఓ యువకుడు మాత్రం ప్రియురాలికి వినూత్నంగా ప్రపోజ్ చేశాడు. బంగారం, వజ్రాలు బదులు డైపర్స్‌తో ప్రపోజ్ చేసి ఆశ్చర్యపరిచాడు.

యాభై బ్యాగుల్లో డైపర్స్ తీసుకు వెళ్లి ప్రియురాలి చేతిలో పెట్టి ప్రపోజ్ చేశాడు. గాంగ్జూ నగరానికి చెందిన ఫెంగ్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమించాడు. ఆమెతో రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు. అతను తన ప్రియురాలికి ఎలా ప్రపోజ్ చేయాలా అని ఆలోచించాడు.

Chinese man proposes girlfriend with over 50 packs diapers instead of diamonds

అదే సమయంలో అతని ప్రియురాలు గర్భవతి. దీంతో స్నేహితులు, ఇతరుల సూచన మేరకు అతను అతను 4,500 డైపర్స్‌ను హృదయాకారంలో ఉంచాడు. ఆమెను పెరల్ నది వద్దకు పిలిచాడు. యాభై బ్యాగుల్లో ఉంచిన డైపర్స్‌ను డ్రోన్ ద్వారా ఆమెకు ఇచ్చి, ప్రపోజ్ చేశాడు.

ఆమె సంచులు తెరిచి చూసింది. అందులో ఉన్న డైపర్స్‌ను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అయితే, మరో విషయమేమంటే అందులో కనిపించకుండా డైమండ్ రింగ్ పెట్టాడు. అందులో ఓ వ్యాఖ్యం కూడా రాశాడు. ఇప్పటి నుంచి నీ బాధ్యత, నీకు పుట్టబోయే బిడ్డ బాధ్యత నాదే అని పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+