Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బొద్దింకను చంపబోయి అపార్ట్ మెంట్ నే తగలెట్టేసిందిగా..

ఈ మహిళ చేసిన పని తెలిస్తే ఎవరైనా నోరు వెళ్లబెడతారు. బొద్దింకను చంపే క్రమంలో అపార్ట్ మెంట్ నే తగలెట్టేసింది. ఈ షాకింగ్ ఘటన సౌత్ కొరియాలో జరిగింది. ఈ మంటల్లో ఒకరు మృతి చెందగా.. మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. సరైన ఆలోచన లేకుండా మహిళ చేసిన పనికి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు మండిపడుతున్నారు. మనం ఒకలా ఆలోచిస్తే.. దేవుడు మరోలా ఆలోచిస్తాడంటూ కామెంట్స్ పెడుతున్నారు.

సౌత్ కొరియాలోని గయోంగీ ప్రావిన్స్ లోని ఓసాన్ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ బొద్దింకను చంపేందుకు యత్నించగా అపార్ట్ మెంట్ మంటల్లో దగ్ధమైంది. బొద్దింకను చంపేందుకు రసాయనిక పదార్థాలతో కూడిన ఫైర్ థ్రోయర్ ను వాడింది. దాంతో ప్రమాదవశాత్తు ఆమె రూమ్ లో మంటలు వ్యాప్తించి క్షణాల్లోనే అపార్ట్ మెంట్ ను కమ్మేశాయి. మంటల నుంచి బయటపడే క్రమంలో కిటికీ నుంచి దూకి ఒకరు మృతి చెందారు. అలాగే దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడక మరికొంతమంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.

కొరియా టైమ్స్ అందించిన కథనం ప్రకారం.. 20 ఏళ్ల వయసున్న ఓ యువతి తన రూమ్ లో బొద్దింకలను చంపేందుకు ఏరోసాల్ స్ప్రే, లైటర్ ను వినియోగించింది. గతంలోనూ ఆమె వీటినే ఉపయోగించి ఇంట్లోని బొద్దింకలను చంపేసింది. కానీ ఈ సారి మాత్రం ప్రమాదవశాత్తు రూమ్ లోని రసాయనిక పదార్థాలకు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మెట్ల మార్గం మొత్తం మంటలు వ్యాపించాయి. దీంతో తప్పించుకునే దారి మూసుకుపోయింది. దీంతో అపార్ట్ మెంట్ లోని మిగతా ప్రజలు కిందకు రాలేకపోయారు. దట్టమైన పొగలు వ్యాప్తి చెందడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు.

Cockroach Chaos in South Korea Woman s DIY Flamethrower Sparks Deadly Apartment Inferno

అయితే ఇదే అపార్ట్ మెంట్ లో తన ఫ్యామిలీతో ఉండే ఓ మహిళ.. కిటికీ నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఇంట్లోని కీటకాలను ఏరోసాల్ వినియోగించి చంపడం ఎంత ప్రమాదకరమో అర్థమవుతోందని నిపుణులు చెబుతున్నారు. మహిళ నిర్లక్ష్యం కారణంగా అపార్ట్ మెంట్ ఫైర్ అంటుకుని మహిళ మృతి చెందిందని.. మరికొంతమంది గాయపడినట్లు ఓసాన్ ప్రాంత పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+