పాకిస్తాన్ ను చావుదెబ్బ కొట్టాం ..! సగర్వంగా కల్నల్ సోఫియా ఖురేషీ ప్రకటన..!
పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ రెండో రోజూ విజయవంతంగా పూర్తయింది. నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ తో చావు దెబ్బ కొట్టిన భారత సైన్యం.. ఇవాళ పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగకుండా అడ్డుకుంది. లాహోర్ నుంచి భారత్ లోని 15 నగరాలపై ప్రయోగించిన క్షిపణుల్ని అక్కడికక్కడే అడ్డుకుని గగనతల వ్యవస్థల్ని దెబ్బతీసింది. ఈ ఆపరేషన్ కు నేతృత్వం వహిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషీ వివరాలను సాయంత్రం వెల్లడించారు.
నిన్న రాత్రి ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని వివిధ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ చేసిన విస్తృతమైన డ్రోన్ , క్షిపణి దాడిని భారత సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయని కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. లాహోర్‌లో వైమానిక రక్షణ వ్యవస్థను తటస్థీకరించడం కూడా ఇందులో ఉందన్నారు. భారతదేశ ఇంటిగ్రేటెడ్ కౌంటర్-యూఏఎస్ గ్రిడ్ , వైమానిక రక్షణ వ్యవస్థలు రాబోయే ముప్పులను సమర్థవంతంగా అడ్డుకున్నట్లు తెిపారు.

ఇవాళ ఉదయం పాకిస్తాన్ అంతటా బహుళ వైమానిక రక్షణ రాడార్లు, వ్యవస్థలపై భారత సాయుధ దళాలు ప్రతీకార దాడులు నిర్వహించాయని కల్నల్ ఖురేషి పేర్కొన్నారు. భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని అనేక ప్రదేశాలలో వైమానిక రక్షణ రాడార్లు , వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపారు. భారత ప్రతిస్పందన పాకిస్తాన్ మాదిరిగానే తీవ్రతతో ఉందన్నారు. లాహోర్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థ ను ధ్వంసం చేసినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు.
#WATCH | Delhi: Colonel Sofiya Qureshi says, "This morning, the Indian Armed Forces targeted Air Defence Radars and systems at a number of locations in Pakistan. Indian response has been in the same domain with same intensity as Pakistan. It has been reliably learnt that an Air… pic.twitter.com/chaTbH8nsg
— ANI (@ANI) May 8, 2025
నిన్న రాత్రి పాకిస్తాన్ ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరలై, భుజ్‌లతో సహా అనేక సైనిక లక్ష్యాలను డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి దాడి చేయడానికి ప్రయత్నించిందని కల్నల్ ఖురేషీ తెలిపారు. వీటిని తాము సమర్దంగా అడ్డుకుని వారి గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశామన్నారు.












Click it and Unblock the Notifications