షాక్: ఖైదీలతో లేడీ ఆఫీసర్ కామ కలాపాలు, 11 మంది చూస్తుండగానే శృంగారం, చివరకు అరెస్ట్
వాషింగ్టన్: జైల్లో ఖైదీలను నేరప్రవృత్తి నుంచి మంచి మార్గంలో నడిపించాల్సిన ఓ జైలు అధికారిణి వికృత చేష్టలకు పాల్పడింది. ఖైదీలతోనే తన కామవాంఛలను తీర్చుకుంది. చివరకు కటకటాల పాలైంది. ఈ దిగ్భ్రాంతికర ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ప్రెస్నో కౌంటీలోని జైలు అధికారిణి(ఖైదీల్లో మార్పుతెచ్చే)గా టీనా గొంజాలెజ్(27) 2016 నుంచి పనిచేస్తోంది. ఖైదీలతో తనకు నచ్చిన సమయంలో విచ్చలవిడిగా శృంగార కార్యకలాపాల్లో మునిగితేలేది. నచ్చిన ఖైదీలతో సెక్స్‌లో పాల్గొనేది. అయితే, ఒకసారి 11 మంది ఖైదీలు చూస్తుండగానే.. ఓ ఖైదీతో శృంగారంలో పాల్గొని తన కామవాంఛ తీర్చుకుంది.

దీంతో అనేక ఫిర్యాదులు ఆమెపై ఉన్నతాధికారులకు వెళ్లాయి. అంతేగాక, ఖైదీలకు సెల్‌ఫోన్లు, బ్లేడులు సరఫరా చేసిందని, జైల్లో సోదాలు జరిగేటప్పుడు వారిని ముందస్తుగా హెచ్చరించేదని మరో జైలు అధికారి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్లలో ఖైదీలతో అసభ్యకరంగా మాట్లాడుతుండేదని, తాను చేసిన నేరాల గురించి వారితో గొప్పగా చెప్పుకునేదని ఆ అధికారి కోర్టుకు తెలిపారు.
టీనా గొంజాలెజ్ ప్రవర్తన గురించి తెలుసుకున్న న్యాయమూర్తులు కూడా షాకయ్యారు. కేసు విచారణ సందర్భంగా ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకున్నావని వ్యాఖ్యానించింది. కాగా, ఆమెకు గత నేరచరిత్ర లేకపోవడంతో శిక్షను తగ్గించారు. రెండేళ్ల ప్రొబేషన్, ఏడు నెలల జైలు శిక్ష విధించారు. ఖైదీలతో శృంగారం చేసి జైలుపాలైన ఈ మహిళా అధికారిని కాలిఫోర్నిల్ హాట్‌టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications