డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్: అక్కడా చుక్కెదురు
ముస్లీం మెజార్టీ కలిగిన ఏడు దేశాల వారు ప్రవేశంపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ విధించిన నిషేధాన్ని నిలిపివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు అమెరికన్ ఫెడరల్ అప్పీల్ న్యాయస్థానం నిరాకరించింది
వాషింగ్టన్: ముస్లీం మెజార్టీ కలిగిన ఏడు దేశాల వారు ప్రవేశంపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని నిలిపివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు అమెరికన్ ఫెడరల్ అప్పీల్ న్యాయస్థానం నిరాకరించింది.
ట్రంప్ కార్యవర్గం దీనిపై తొమ్మిదో సర్క్యూట్ న్యాయస్థానంలో అప్పీలును దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తులు విలియమ్ కాన్‌బే, మిచెల్లీలు స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. వారు తమ రెండు పేరాల రూలింగ్‌లో కారణాలు వెల్లడించలేదు.

వాషింగ్టన్, మిన్నెసోటా న్యాయస్థానాల్లో ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా అవసరమైన పత్రాలను సమర్పించేందుకు ఆదివారం రాత్రి వరకు సమయముంది. ఇక న్యాయశాఖకు మాత్రం సోమవారం మధ్యాహ్నం వరకు సమయమిచ్చారు.












Click it and Unblock the Notifications