కోవిడ్19: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనావైరస్ కేసులు, బీజింగ్ మారథాన్‌ వాయిదా - Newsreel

కరోనా

చైనాలో మళ్లీ కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 11 ప్రావిన్సుల్లో 133కు పైగా కోవిడ్ కేసులు బయటపడ్డాయి. అన్నీ కూడా ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ ఇంఫెక్షన్లే.

మళ్లీ కోవిడ్ విజృంభించే అవకాశం ఉందని చైనా ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు.

ఈ ఏడాది ఆగస్టులో నాన్జింగ్‌లో కరోనావైరస్ వ్యాప్తి ఆందోళన కలిగించింది.

ఆ తరువాత చైనాలో ఇంత పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

దాంతో కరోనావైరస్‌ను అదుపుచేయడంలో చైనా సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

చైనాలోని అతి పెద్ద క్రీడోత్సవాలలో బీజింగ్ మారథాన్ ఒకటి

మరోవైపు, కరోనా కేసులు పెరుగుతుండటంతో బీజింగ్ మారథాన్‌ను నిరవధికంగా వాయిదా వేశారు.

1981 నుంచి నిర్వహిస్తున్న బీజింగ్ మారథాన్, చైనాలో జరుపుకునే అతి పెద్ద క్రీడోత్సవాలలో ఒకటి.

అక్టోబర్ 31న జరగాల్సి ఉన్న ఈ మారథాన్‌లో దాదాపు 30,000 మంది పాల్గొంటారని అంచనా.

"కోవిడ్ వ్యాప్తికి అవకాశం ఉందని భావిస్తూ.. రన్నర్స్, సిబ్బంది, స్థానికుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ మారథాన్‌ను రద్దు చేస్తున్నట్లు" నిర్వాహకులు ప్రకటించారు.

2022 వింటర్ ఒలింపిక్స్‌కు కూడా చైనా ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో చైనా జీరో-కోవిడ్ విధానం అమలుపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

తాజా కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు చైనా ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. టెస్టుల సంఖ్యను పెంచింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

కోవిడ్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటనలపై నిషేధం విధించింది.

ఆస్ట్రేలియా లాంటి దేశాలు జీరో-కోవిడ్ విధానం నుంచి పక్కకు తప్పుకుని వైరస్‌తో కలిసి జీవించే విధానానికి మారాయి.

కానీ చైనా, జీరో-కోవిడ్ వ్యూహానికే కట్టుబడి ఉంది. కఠినమైన లాక్‌డౌన్‌లు, అధిక సంఖ్యలో టెస్టులు, భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ విధానాలను అమలుచేస్తోంది.

గత శనివారానికి ఆ దేశ జనాభాలో 75.6 శాతానికి రెండు డోసుల వ్యాక్సీన్ వేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+