దాని వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం లేదు, ఎవరూ భంగం కలిగించలేరు: చైనా

బీజింగ్: చైనా - పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ భారత్‌కు వ్యతిరేకం కాదని డ్రాగన్ కంట్రీ ప్రకటించింది. దీనిని ఏ మూడో దేశం కూడా ప్రభావితం చేయలేదని, భంగం కలిగించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు చైనా దేశ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి హువా చునియాంగ్ మాట్లాడారు.

చదవండి: మళ్లీ సర్జికల్ దాడులు: పాక్‌కు యోగి వార్నింగ్, 'జాగ్రత్త లేదంటే ఆలోచించేలోపు దెబ్బకొడతాం'

చైనా పాకిస్తాన్ కారిడార్‌ను ఆఫ్గనిస్తాన్ వరకు విస్తరించాలని భావిస్తున్నారు. ఈ మేరకు మూడు దేశాల ప్రతినిధులు మంగళవారం భేటీ అయ్యారు. ఆప్గన్ వరకు విస్తరణపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందంటూ వచ్చిన వార్తలపై చైనా స్పందించింది.

CPEC Offer to Afghanistan Not Directed Against India: China

దీనిని తాము ఏ దేశానికి వ్యతిరేకంగా నిర్మించడంలేదని చెప్పారు. మరోవైపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా ఈ ప్రాజెక్టును చేపట్టడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని విలేకరులు ప్రశ్నించారు.

దీనిపై హువా చునియాంగ్ మాట్లాడుతూ.. దీని వల్ల ఏ దేశానికి నష్టం ఉండదని తాము చెబుతున్నామని, దీని వల్ల మూడో దేశానికి ప్రయోజనాలు ఉంటాయని భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై రాజకీయం తగదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+