బడా కంపెనీల్లో డేటా లీక్ - డార్క్‌వెబ్‌లో 23 కోట్ల మంది ప్రొఫెల్స్ - ఇన్‌స్టా, టిక్ టాక్, యూట్యూబ్
సోషల్ మీడియా దిగ్గజాలు, రాజకీయ పార్టీల మధ్య చీకటి వ్యవహారాలపై చర్చ తీవ్రస్థాయికి చేరిన వేళ.. భారీ డేటా లీకేజీ కుంభకోణం కలకలం రేపుతున్నది. బడా సోషల్ జెయింట్స్ గా పేరుపొందిన కంపెనీల్లో కోట్లాది మంది యూజర్ల వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురైంది. ఇటీవల కాలంలో డేటా లీకేజీలు కొత్తకానప్పటికీ, ఒకేసారి ఏకంగా 235 మిలియన్(23.5 కోట్ల) మంది బాధితులు ఉండటంతో దీన్ని అతిపెద్ద లీకేజీగానూ అభివర్ణింస్తున్నారు.
బడా కంపెనీలైన ఫేస్ బుక్ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్, చైనీస్ బైట్ డ్యాన్స్ కంపెనీ బ్రాండ్ టిక్ టాక్, గూతుల్ సంస్థకు చెందిన యూట్యూబ్ ఫ్లాట్ ఫారమ్స్ యూజర్లలో 235 మిలియన్ల మంది సమాచారం డార్క్ లో లీకైనట్లు ''కాంపారిటెక్''అనే రీసెర్చ వెబ్ సైట్ వెల్లడించింది. అత్యధికంగా ఇన్ స్టా నుంచి రెండు విడతలుగా, టిక్ టాక్, యూట్యూబ్ నుంచి ఒక్కో విడతలో డేటా చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆయా ప్రొఫొల్స్ లోని ఫొటోలు, ఈమెయిల్స్, ఫోన్ నంబర్లు తదితర సమాచారం మొత్తం ఇప్పుడు డార్క్ వెబ్ లో ఎలాంటి పాస్ వర్డ్ లేకుండా ఉందని 'కామ్ పారిటెక్' తెలిపింది.

నిజానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో అంతా ఓపెనే, అందులోని సమాచారాన్ని ఎవరైనా సేకరించే వీలుంటుంది. అందుచేత, ఇప్పటి డేటా లీకేజీ ఘటనను హ్యాకింగ్ గా భావించరాదని, కంపెనీల నుంచే గంపగుత్తగా సమాచారం సేకరించడాన్ని 'డేటా ఫిషింగ్' అంటారని, ఇది కచ్చితంగా యూజర్ల భద్రతకు ముప్పు కలిగించే అంశమేనని నిపుణఉలు చెబుతున్నారు. డేటా చోరీలపై ఆయా సోషల్ మీడియా సంస్థలు తగిన జాగ్రత్త వహించడంలేదన్న విమర్శలు కూడా తెలిసిందే.
ఇన్‌స్టా, టిక్ టాక్, యూట్యూబ్ నుంచి లీకైన యూజర్ల డేటా మొత్తం స్పామర్స్, సైబర్ క్రిమినల్స్‌కు ఉపయోగపడుతుందని కాంపారిటెక్ వెబ్‌సైట్ ఎడిటర్ పాల్ బిస్చెఫ్ అన్నారు. గత నెల షైనీ హంటర్స్ అనే హ్యాకింగ్ గ్రూప్ 18 కంపెనీలకు చెందిన 386 మిలియన్ల యూజర్ల డేటాను లీక్ చేయడమే కాకుండా.. ఈ డేటాను అందరూ డౌన్ లోడ్ చేసే విధంగా ఒక ఫోరమ్‌లో అప్ లోడ్ చేశారని గుర్తుచేశారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications