భారీ బాంబ్ బ్లాస్ట్.. ఏడుగురు మృతి.. భయానక దృశ్యాలు..
అఫ్గానిస్థాన్ రాజధాని సెంట్రల్ కాబుల్ లో భారీ పేలుడు సంభవించింది. షహర్- ఎ- నవ్ ప్రాంతంలోని ఓ చైనీస్ రెస్టారెంట్ లక్ష్యంగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ భీకర దాడిలో ఏడుగురు మృతి చెందగా 13 మంది గాయపడినట్లు తెలుస్తోంది. చైనా అధికారులు వస్తున్న కారును టార్గెట్ గా చేసుకుని ఈ బాంబు దాడి చేసినట్లు సమాచారం. మృతుల్లో ఒక చైనా దేశస్థుడు ఉండగా.. ఆరుగురు అఫ్గానీలు ఉన్నట్లు సమాచారం. ఇక గాయపడ్డ వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.
#BREAKING: Massive explosion hit a Chinese hotel on Gulfaroshi Street in Kabul’s Shahr-e-Naw area in Afghanistan, causing several casualties. Exact nature of blast is still under investigation as per Kabul Police Chief. Not known if it was a terror attack or Gas Cylinder blast. pic.twitter.com/os1HJxQRcs
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 19, 2026
కాబుల్ లోనే సురక్షిత జిల్లాగా పేరుగాంచిన షహర్-ఎ-నవ్ పరిసరాల్లో ఈ ఆత్మాహుతి దాడి జరగడం స్థానికంగా సంచలనంగా మారింది. చైనీయులే లక్ష్యంగా ఈ హోటల్ పై దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా 13 మంది గాయపడినట్లు సమాచారం. పెద్ద కార్యాలయాలు, షాపింగ్ కాంప్లెక్సులు, రాయబార కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో పేలుడు జరిగిన నేపథ్యంలో అక్కడి భద్రతా లోపాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక బాంబు పేలుడు జరిగిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు ఇది ఆత్మాహుతి దాడి అని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ ఈ పేలుడుకు ఏ గ్రూప్ బాధ్యత వహించలేదు. దీంతో ఇది బాంబు పేలుడా..? లేక ఏదైనా గ్యాస్ సిలిండర్ పేలిందా..? అనే కోణంలో భద్రతా బలగాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇక కాబుల్ లోని న్యూ సిటీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. అయితే ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చైనా పౌరులు నివసం ఉంటున్నారు. మరి చైనీయులే లక్ష్యంగా బాంబు దాడి జరిగిందా..? అనే కోణంలోనూ దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications