గందరగోళం:ట్విట్టర్‌కు ట్రంప్ గుడ్‌బై చెప్పారా, అసలేం జరిగింది?

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఓ ఉద్యోగి పొరపాటు కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ఖాతా 11 నిమిషాల పాటు పనిచేయకుండా పోయింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన ట్విట్టర్ యాజమాన్యం వెంటనే ట్రంప్ ట్విట్టర్‌ను పునరుద్దరించారు.

గురువారం సాయంత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ఖాతా 11 నిమిషాల పాటు పనిచేయలేదు. ఈ ఖాతాను ఫాలో అయ్యే వారికి అర్ధం కాలేదు. ఈ విషయమై గందరగోళ వాతావరణం నెలకొంది. ట్రంప్ ట్విట్టర్‌కు గుడ్‌బై చెప్పారంటూ ప్రచారం కూడ సాగింది. అయితే మానవ తప్పిదం వల్లే ఈ ఘటన చోటుచేసుకొందని చివరకి గుర్తించారు.

ట్రంప్‌ పర్సనల్‌ ట్విటర్‌ అకౌంట్‌లో ఫాలోవర్ల సంఖ్య 41.7 మిలియన్లు. ఇంతటి ఫాలోయింగ్‌ను ట్రంప్‌ వదులుకున్నారా? అనే ప్రశ్న కూడా వచ్చింది. అసలేం జరిగింది అన్న సందిగ్ధం గురువారం సాయంత్రం మొదలైంది.

Did Donald Trump quit Twitter? Here's what happened

ఇంతకూ జరిగిన విషయమేమింటే.. గురువారం సాయంత్రం @realdonald trump అకౌంట్‌ మెసేజ్‌ చేస్తే.. ట్విటర్‌ నుంచి ఈ పేజీ ఇప్పడు పనిచేయడం లేదు అనే రిప్లయి మెసేజ్‌ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అందరిలోనూ ట్రంప్‌ ట్విటర్‌ నుంచి బయటకు వెళ్లిపోయారని అనుకున్నారు.

అయితే వాస్తవంగా.. ట్విటర్‌లో పనిచేసే ఒక ఉద్యోగి చేసిన పొరపాటు వల్ల ట్రంప్‌ వ్యక్తిగత అకౌంట్‌ 11 నిమిషాల పాటు పూర్తిగా నిలిచిపోయింది. అయితే జరిగిన పొరపాటు తెలుసుకొన్న ట్విటర్‌ అధికారులు.. వెంటనే ట్రంప్‌ అకౌంట్‌ను పునరుద్ధరించారు.ట్రంప్‌ అకౌంట్‌కు ఇలా ఎందుకు జరిగిందన్న విషయంపై విచారణ చేస్తున్నట్లు ట్విటర్‌ తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
US President Donald Trumps well-known Twitter account briefly vanished on Thursday evening -- with the social media company blaming "human error by a Twitter employee."

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి