పుస్తకం కోసం.. న్యూడ్ గా పోజులిచ్చిన క్రీడాకారిణి
అమెరికా : ఆటలోకి దిగి సత్తా చాటాలంటే.. మెలుకువలు మాత్రమే తెలిస్తే సరిపోదు అందుకు తగ్గట్టు బాడీ ఫిట్ నెస్ కూడా ఉండాలి. అందుకే ఆటకు ఎంత ప్రాధాన్యమిస్తారో.. ఫిట్ నెస్ పై కూడా అంతలా ఫోకస్ చేస్తుంటారు క్రీడాకారులు. అభిమానులు కూడా ఆరాధ్య క్రీడాకారుల ఫిట్ నెస్ మంత్రా గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు.
తాజాగా తన ఫిట్ నెస్ మంత్ర గురించి అభిమానులకు తెలియపరిచేలా.. ఓ పుస్తకాన్ని వెలువరించింది స్కైయింగ్ క్రీడాకరిణి లిండ్సే వాన్. ఫిట్ నెస్ కోసం తాను చేసిన కసరత్తులను, తన అనుభవాలను ఆ పుస్తకంలో పొందుపరిచింది లిండ్సే. అయితే ఈ పుస్తక ప్రమోషన్ కోసం లిండ్సే వ్యవహరించిన తీరు కాస్త చర్చలకు తావిచ్చేదిగా మారింది.

తన బుక్ ప్రమోషన్ కోసమే లిండ్సే న్యూడ్ గా ఫోటోలకు పోజివ్వడంతో.. ఓ పుస్తకాన్ని ప్రమోట్ చేసుకోవడానికి క్రీడాకారిణి ఇలా న్యూడిటీని ఆశ్రయించడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేవలం స్కైయింగ్ పరికరాలను మాత్రమే పట్టుకుని ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటోలకు పోజులు ఇచ్చింది లిండ్సే.
ఇక పుస్తకం విషయానికొస్తే.. ఫిట్ నెస్ కు సంబంధించి శరీరాన్ని ఎలా నియంత్రణ ఉంచుకోవాలి? ఎలాంటి డైట్ మెయింటెయిన్ చేయాలి? లాంటి విషయాలకు తన అనుభవాలను జోడించి రాసింది లిండ్సే. అయితే పుస్తకం విషయమేమో గానీ ఆమె న్యూడ్ ఫోటో షూట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం గమనార్హం.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications