Green Card: డైవర్సిటీ వీసా ప్రాసెస్ స్టార్ట్.. నవంబర్ 1 నుంచి గ్రీన్ కార్డ్ లాటరీ !

అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందాలని కలలు కనే ప్రపంచవ్యాప్త దరఖాస్తుదారులకు అమెరికా ఫెడరల్ కోర్టు తీపి కబురు అందించింది. 2027 సంవత్సరానికి సంబంధించి ప్రతిష్టాత్మక 'డైవర్సిటీ వీసా ప్రొగ్రామ్' (గ్రీన్ కార్డ్ లాటరీ) రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోర్ట్ ఆదేశించింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ ప్రాసెస్ షురూ చేయకపోవడంతో 'రెడ్ ఈగిల్ లా' అనే ఇమ్మిగ్రేషన్ లా సంస్థ కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కాలిఫోర్నియా సదరన్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ జడ్జ్ జిన్‌సూక్ ఓహ్తా, అక్టోబర్ 14న ప్రాథమిక ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేస్తూ అక్టోబర్ 29 నాటికి ప్రకటన విడుదల చేసి, నవంబర్ 1 నాటికి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించాలని స్పష్టం చేశారు.

మారిన షెడ్యూల్.. నవంబర్ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ

కోర్టు ఆమోదించిన నూతన షెడ్యూల్ ప్రకారం అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అక్టోబర్ 29 నాటికి గ్రీన్ కార్డ్ లాటరీ వివరాలను ప్రకటించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 1 నుంచి ఆన్‌లైన్ ద్వారా ఎంట్రీల స్వీకరణ మొదలవుతుంది. ఈ దరఖాస్తుల స్వీకరణ మొత్తం 30 రోజుల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత లాటరీ ద్వారా ఎంపికైన అభ్యర్థుల జాబితాను డిసెంబర్ 3 నాటికి వెల్లడించనున్నారు. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం 55,000 గ్రీన్ కార్డ్ వీసాల కోటా పూర్తయ్యే వరకు లేదా సెప్టెంబర్ 30, 2027 నాటికి ఈ ఎంపిక ప్రక్రియ చట్టబద్ధంగా కొనసాగుతుంది.

Diversity Visa 2027 US Federal Court Directs State Department to Open Green Card Lottery Entries by Nov 1

అసలు ఆలస్యానికి కారణమేంటి?

నిజానికి 2027 డీవీ ప్రోగ్రామ్ ఎంట్రీ ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు 2025 నవంబర్‌లోనే స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. అయితే ఆ తర్వాత సాధారణ షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులను ఆహ్వానించకుండా జాప్యం చేస్తూ వచ్చింది. చట్టబద్ధమైన గడువు దాటిపోయినందున ఈ ఏడాది లాటరీ నిర్వహించడం కుదరదని ట్రంప్ యంత్రాంగం వాదించింది. అయితే ప్రభుత్వ తీరు వల్ల ఈ ప్రోగ్రామ్ రద్దయ్యే ప్రమాదం ఉందని భావించిన న్యాయ సంస్థ కోర్టును ఆశ్రయించడంతో ట్రంప్ సర్కార్ వాదనలను కోర్టు తిరస్కరించి, వెంటనే ప్రాసెస్ ప్రారంభించాలని తేల్చిచెప్పింది.

US Green Card: గ్రీన్ కార్డుల ఫ్రీజ్ తో భారతీయులపై పడే ప్రభావం- 8 సందర్భాలు..!
US Green Card: గ్రీన్ కార్డుల ఫ్రీజ్ తో భారతీయులపై పడే ప్రభావం- 8 సందర్భాలు..!

ఏమిటీ 'డైవర్సిటీ వీసా లాటరీ'?

అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కింద ఈ 'డైవర్సిటీ వీసా' విధానాన్ని అమలు చేస్తున్నారు. అమెరికాకు తక్కువ సంఖ్యలో వలస వెళ్లే దేశాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ప్రతి ఏటా లాటరీ పద్ధతిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 55,000 మందికి గ్రీన్ కార్డ్‌లు కేటాయిస్తారు. నిర్ణీత విద్యార్హతలు లేదా పని అనుభవం ఉన్న అభ్యర్థులు దీనికి అర్హులు. అయితే లాటరీలో పేరు వచ్చినంత మాత్రాన నేరుగా గ్రీన్ కార్డ్ రాదు, ఆ తర్వాత జరిగే తనిఖీలు, ఇంటర్వ్యూలు విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

వీళ్లంతా చీప్ లేబర్? హెచ్ 1బీ, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పై జేడీ వ్యాన్స్ సెన్సేషనల్ కామెంట్స్
వీళ్లంతా చీప్ లేబర్? హెచ్ 1బీ, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పై జేడీ వ్యాన్స్ సెన్సేషనల్ కామెంట్స్

గతం నుంచి వివాదాల నడుమ గ్రీన్ కార్డ్ ప్రక్రియ

గ్రీన్ కార్డ్ లాటరీ ప్రక్రియ గత కొంతకాలంగా వివాదాలతో సాగుతోంది. 2025 డిసెంబర్‌లో బ్రౌన్ యూనివర్సిటీ షాకింగ్ షూటింగ్ ఘటన, ఎంబఐటీ ప్రొఫెసర్ హత్య తర్వాత భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్‌పై నిలిపివేత విధించింది. ఆ నిందితుడు ఈ డీవీ ప్రోగ్రామ్ ద్వారానే అమెరికాలోకి ప్రవేశించాడని ఆరోపణలు వచ్చాయి. అయితే ఆగస్టులో కోర్టు ఆదేశాల మేరకు ప్రక్రియ మళ్లీ ప్రారంభమైనా, సాంకేతిక ఆలస్యాల వల్ల డీవీ-2026 విజేతలలో చాలా మంది తమ అవకాశాలను కోల్పోయారు. ఇప్పుడు 2027 చక్రానికి కోర్టు స్పష్టమైన గడువు విధించడంతో ఆశావహులు అధికారిక వెబ్‌సైట్ ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+