యజమానిని చావు నుండి తప్పించింది..చివరకు ఆయన చేతిలోనే చనిపోయింది

కెనడా :కుక్క విశ్వాసానికి ప్రతీకగా చెబుతారు. అనేక ఘటనల్లో యజమానులకు కుక్కలు విశ్వాసంగా నిలిచిన ఘటనలు చూశాం.అయితే చావు నుండి యజమాని ప్రాణాలు కాపాడిక కుక్క చివరకు యజమాని చేతిలోనే చనిపోయింది. యజమాని ప్రాణాలను రక్షించేందుకు తన ప్రాణాలను పోగొట్టుకొంది.

కెనెడాలోని క్యూబెక్ పట్టణానికి చెందిన మార్కో లవోయి అడవికి వెళ్ళాడు. రెండు మాసాల పాటు అడవిలో ఉండేందుకు అవసరమైన సామాగ్రిని తీసుకెళ్ళాడు. తనతోపాటు తన పెంపుడు కుక్కను కూడ ఆయన తీసుకెళ్ళాడు.

అడవిలో క్యాంపును ఏర్పాటుచేసుకొని ఉంటున్నాడు. ఒకరోజు రాత్రి పూట మార్కో క్యాంపు వద్దకు ఎలుగుబంటి వచ్చింది.క్యాంపును ద్వంసం చేసింది.అయితే ఈ సమయంలో మార్కో పెంపుడు కుక్క అలెర్ట్ అయింది. వెంటనే ఎలుగుబంటిని తరిమివేసింది.ఎలుగుబంటి క్యాంపును ద్వంసం చేయడంతో మార్కో వద్ద ఉన్న ఆహార పదార్థాలన్నీ పాడయ్యాయి.

dog escape his owner from death...but it died for owner hungry

అడవులో దొరికే దుంపలతో పాటు కొంత కాలంపాటు మార్కో తన ఆకలిని తీర్చుకొన్నాడు.మార్కో ఉంటున్న ప్రాంతం నుండి పట్టణానికి వెళ్ళాలంటే వందల కిలోమీటర్లు. ఈ సమాచారాన్ని తన సన్నిహితులకు చేరవేయాలంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడ లేవు. ప్రతి రోజూ దుంపల కోసం గంటల కొద్ది సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. దీని కోసం ఇంకా అడవిలోనికి వెళ్ళాల్సి వస్తోంది. ఒక చేసేది లేక తన కుక్కనే చంపాలని భావించాడు.

తన పెంపుడు కుక్క పడుకోగానే దానిపై రాయి వేసి చంపాడు. దాని మాంసాన్ని వండుకొని తిన్నాడు.మార్కో ఇంకా బతకడానికి ఈ కుక్క మాంసమే కారణమైంది. అయితే రెండు మాసాల తర్వాత అడవిలోకి వచ్చిన ఫారెస్టు అధికారులు మార్కోను గుర్తించారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న మార్కోను వెంటనే ఆసుపత్రిలో చేర్పించాడు. అతను సగానికి సగం బరువు తగ్గిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+