చైనావి మాటలే తప్ప, యుద్ధం చేయకపోవచ్చు, మిలిటరీ ఆపరేషన్ కూడా!

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్/న్యూఢిల్లీ: భారత్ - చైనా సరిహద్దుల్లోని డొక్లామ్ ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా రోజుకో రెచ్చగొట్టే వ్యాఖ్య చేస్తున్నప్పటికీ ఆ దేశం భారత్‌పై యుద్ధానికి దిగకపోవచ్చునని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

మా సత్తా తెలుసుకో: మోడీని టార్గెట్ చేసిన చైనా, ఇండియాను తరిమేందుకు చైనా ఆపరేషన్!

ఆపరేషన్ అవకాశాలు తక్కువే

ఆపరేషన్ అవకాశాలు తక్కువే

డొక్లామ్ నుంచి భారత సైనికులను తరిమికొట్టేందుకు చిన్నపాటి మిలిటరీ ఆపరేషన్‌ను సైతం అది చేపట్టే అవకాశం తక్కువేనని భద్రతా వర్గాలు భావిస్తున్నాయని తెలుస్తోంది.

అదొక్కటే పరిష్కారం.. యుద్ధమే అంటే మనం సిద్ధం

అదొక్కటే పరిష్కారం.. యుద్ధమే అంటే మనం సిద్ధం

ఈ వివాదం నుంచి ఇటు భారత్, అటు చైనా మర్యాదగా బయటపడాలంటే రెండు దేశాలు డొక్లామ్ నుంచి తమ సైన్యాలను ఉపసంహరించుకోవడం ఒక్కటే మార్గమని తెలిపాయి. అందుకు ఒప్పుకోకుండా చైనా జగడానికి గానీ, యుద్ధానికి గానీ దిగితే దానిని ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ సన్నద్ధంగా ఉందని చెబుతోంది.

దుస్సాహసానికి దిగితే ఇండియన్ ఆఱ్మీ రెడీ

దుస్సాహసానికి దిగితే ఇండియన్ ఆఱ్మీ రెడీ

చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఏ) ఏదైనా దుస్సాహసానికి ఒడిగడితే తిప్పికొట్టేందుకు సరిహద్దుల్లో తమ సన్నద్ధతను పెంచిందని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇరుదేశాల సైన్యాలు కేవలం 100ల మీటర్ల దూరంలో ఉన్న నేపథ్యంలో చైనా మీడియా తరుచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోన్న విషయం తెలిసిందే.

దాదాపు రెండు నెలలుగా

దాదాపు రెండు నెలలుగా

డొక్లామ్ వద్ద ఇరు దేశాలకు చెందిన 300 నుంచి 350 ట్రూప్స్ ఉన్నాయి. ఇరు దేశాల ఆర్మీకి దూరం కేవలం వంద, నూటా యాభై మీటర్ల దూరం మాత్రమే ఉంది. గత యాభై రోజులకు పైగా ఈ ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Far away from the actual faceoff site at Doklam, where rival soldiers are close enough to literally smell each other in the rarefied air of the high-altitude region, the Indian security establishment is reasonably sure China will not risk a war or even "a small-scale military operation" despite all its belligerent rhetoric.
Please Wait while comments are loading...