Donald Trump: గ్రీన్ కార్డుపై ట్రంప్ బాబాయ్ రూటే సపరేటు..!!

Donald Trump:ఇమ్మిగ్రేషన్ విధానానికి పూర్తి వ్యతిరేకి అయిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో చాలా మార్పు కనిపిస్తోంది. అమెరికాలో డిగ్రీ చేసిన విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డు అందేలా కార్యాచరణ సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. ఇలా చేస్తే వారు అమెరికాలోనే స్థిరపడతారని చెప్పారు.

అమెరికాలో డిగ్రీ పూర్తి చేసిన విదశీ విద్యార్థుల్లో ప్రతిభ దాగి ఉందని చెప్పిన ట్రంప్...అలాంటి వారిని దేశం వదులుకోకూడదని సూచించారు. అలాంటి వారు అమెరికాలో ఉంటే దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళుతుందని ఈ మాజీ అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. ఓ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ గ్రీన్ కార్డు, విదేశీ విద్యార్థులపై కీలక వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఇది సర్వత్రా చర్చకు దారితీస్తోంది.

Donald Trump Calls for Automatic Green Cards for US-Educated Foreign Students

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ విద్యార్థులు తమ దేశంలో ఉండకూడదని, అమెరికా దేశస్తులకే తొలి ప్రాధాన్యత ఉంటుందని చెప్పడంతో నాడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. అయితే ఇమ్మిగ్రేషన్ వ్యవహారంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రపంచ దేశాలు తప్పుబట్టాయి. అంతేకాదు దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోందంటూ అలాంటి వారిని నియంత్రించడంలో అధ్యక్షుడు జో బైడెన్ విఫలమవుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్.

అమెరికాలోని టాప్ కాలేజీల నుంచి విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసి జీవితంలో ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలని కలలు కంటారని ట్రంప్ చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే వారు అమెరికాలోనే ఉండాలని భావిస్తున్నారని చెప్పిన మాజీ అధ్యక్షుడు... మంచి మార్కులతో పాస్ అయినవారు ఒక కంపెనీలో పనిచేయాలని అనుకుంటారని అయితే తిరిగి వారి దేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుందన్న ఒకే ఒక కారణంతో వారి కెరీర్‌ను పాడుచేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు

ట్రంప్ తన ప్రచారంలో ఇమ్మిగ్రేషన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే విదేశీయులు అమెరికాలో ఉండకుండా తమ దేశాలకు వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు.అంతేకాదు అమెరికాలో స్థిరపడిన విదేశీయులకు పిల్లలు పుడితే వారికి అమెరికా పౌరసత్వం ఇవ్వడాన్ని తొలగిస్తానని చెప్పుకొచ్చారు. ముస్లిం దేశాల నుంచి వచ్చే ముస్లింలకు అమెరికాలో ఎంట్రీ లేకుండా నియంత్రిస్తానని కూడ వాగ్ధానం చేశారు.తాను అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో అమెరికా మెక్సికో సరిహద్దులో ఒక ప్రహరీ గోడ నిర్మిస్తానని పదేపదే చెప్పేవారు. అయితే తాను అమెరికా అధ్యక్షుడిగా దిగిపోయేనాటికి 452 మైళ్ల మేరా ఆ ప్రహరీ గోడను నిర్మించారు.

మొత్తానికి ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ట్రంప్ తీసుకున్న ఈ యూటర్న్ పై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ట్రంప్ ఎప్పడు ఎలా మాట్లాడుతారో తెలియదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నిజంగానే విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇవ్వాలన్న డిమాండ్ ట్రంప్ చేస్తే దాన్ని స్వాగతించాల్సిన విషయమే అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+