డొనాల్డ్ ట్రంప్: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ అభియోగం

అమెరిక

డొనాల్డ్ ట్రంప్, స్టార్మీ డేనియల్స్

పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిపారనే కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై క్రిమినల్ అభియోగం నమోదు కానుంది. ఆయనపై నిర్దిష్టంగా ఎలాంటి అభియోగాలు నమోదు చేయనున్నారనేదానిపై ప్రస్తుతం స్పష్టత లేదు.

ఆయన 'ఇండిక్ట్‌మెంట్‌'కు మాన్‌హటన్ గ్రాండ్ జ్యూరీ ఆమోదం తెలిపింది. క్రిమినల్ అభియోగాలతో ఇండిక్ట్‌మెంట్‌ ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే. 235 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి.

ఒక వ్యక్తి నేరానికి పాల్పడ్డారనే రాతపూర్వక అభియోగమే ఇన్‌డిక్ట్‌మెంట్. సాధారణ అభియోగాలను ఎవరైనా ప్రాసిక్యూటర్ ముందుకు తెస్తారు. ఇండిక్ట్‌మెంట్ అనేది ఒక 'గ్రాండ్ జ్యూరీ' ప్రొసీడింగ్స్ తర్వాత జరుగుతుంది.

విచారణ ప్రారంభించడానికంటే ముందే ప్రాసిక్యూటర్ సమర్పించే ఆధారాలను పరిశీలించే కొందరు వ్యక్తుల బృందాన్ని గ్రాండ్ జ్యూరీ అంటారు. అవసరమైతే సాక్షులను ఈ జ్యూరీ విచారిస్తుంది. అభియోగం మోపేందుకు తగినంత ఆధారం ఉందా, లేదా అనే దానిపై జ్యూరీ సభ్యులు రహస్య ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు.

ఇండిక్ట్‌మెంట్ జరిగిన వ్యక్తిపై ఇంకో జ్యూరీలో ప్రత్యేకంగా క్రిమినల్ విచారణ జరుగుతుంది.

తనతో ట్రంప్ సెక్స్‌లో పాల్గొన్నారని, ఆ విషయం బయటపెట్టకుండా ఉండేందుకు తనకు డబ్బు చెల్లించారని స్టార్మీ డేనియల్స్ ఆరోపిస్తూ వస్తున్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఈ చెల్లింపు జరిపినట్టు ఆరోపణలు ఉన్నాయి.

స్టార్మీ డేనియల్స్‌కు ట్రంప్ జరిపిన చెల్లింపును వ్యాపార ఖర్చు(బిజినెస్ ఎక్స్‌పెన్స్)‌గా చూపించారని, ఇది బిజినెస్ రికార్డులను తప్పుగా నమోదు చేయడమేననే ఆరోపణలు ఉన్నాయి. న్యూయార్క్‌లో బిజినెస్ రికార్డులను ఇలా చూపించడం చట్టవిరుద్ధం.

రానున్న రోజుల్లో ట్రంప్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ కేసు విషయంలో అధికార యంత్రాంగానికి సహకరిస్తానని ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు.

ట్రంప్ వచ్చే వారం లొంగిపోవచ్చని ఆయన న్యాయ బృందం చెబుతోంది.

ట్రంప్

ట్రంప్ స్పందన ఏమిటి?

తనపై క్రిమినల్ అభియోగం నమోదు వార్తలపై ట్రంప్ స్పందిస్తూ- ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.

ఇది రాజకీయ వేధింపు అని, అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆయన ఆరోపించారు.

"మన దేశ చరిత్రలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు," అని ఆయన వ్యాఖ్యానించారు.

తనను దెబ్బతీసేందుకు డెమోక్రాట్లు అబద్ధాలు చెప్పారని, మోసం చేశారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+