ట్రంప్ స్పీడ్ కు హరీస్ బ్రేకులు - బిగ్ టర్న్..!!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్. పలు రాష్ట్రాల్లో ట్రంప్ మేజిక్ పని చేసింది. విజయం వైపు ట్రంప్ దూసుకెళ్తున్న సమయంలో అనూహ్యంగా కమలా హరీస్ పుంజుకున్నారు. ట్రంప్ 230 - కమలా హరీస్ 192 తో హోరా హోరీగా తల పడుతున్నారు. ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో ఆరింట ట్రంప్ ఆధిక్యత ప్రదర్శించారు. 24 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించగా.. కమలా హరీస్ 14 రాష్ట్రాల్లో ఆధిక్యతలో ఉన్నారు. హరీస్ అతి పెద్ద రాష్ట్రం కాలిఫోర్నియాలో విజయం సాధించారు. దీంతో, ఇప్పుడు తుది ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతోంది.
ట్రంప్ దూకుడు .. తగ్గని హారీస్
అమెరికా అధ్యక్ష ఫలితాల్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తోంది. విజయానికి చేరువ అవుతున్నారు. అయితే, ఇదే సమయంలో అనూహ్యంగా కమలా పుంజుకున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ట్రెండ్స్ మేరకు ట్రంప్ 23 రాష్ట్రాల్లో గెలవటంతో పాటుగా మరో ఏడు రాష్ట్రాల్లో ఆధిక్యతలో ఉన్నారు. కమలా హరీస్ ఇప్పటి వరకు 13 రాష్ట్రాల్లో గెలవటంతో పాటుగా మరో అయిదు రాష్ట్రాల్లో స్పష్టమైన ఆధిక్యతలో కొనసాగుతున్నారు. స్వింగ్ రాష్ట్రాల్లోనూ ట్రంప్ మేజిక్ పని చేసింది. ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో ఆరు చోట్ల ట్రంప్ ఆధిక్యత కొనసాగుతోంది.

ఏ రాష్ట్రంలో ఎవరి గెలుపు
ట్రంప్ - కమలా హరీస్ గెలుపులో ఈ ఏడు రాష్ట్రాలే కీలకం. ఇక్కడి ఫలితాలే అధ్యక్షుడిని ఖరారు చేయనున్నాయి. పాపులర్ ఓట్లలోనూ ట్రంప్ ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. ట్రంప్‌నకు 52శాతం, కమలా హారిస్‌కు 46.2 శాతం పాపులర్ ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ట్రంప్ మిస్సిసిపీ, సౌత్ కరోలినా, టెన్నెసీ, వర్జీనియా, ఇండియానా, ఫ్లోరిడా, ఆర్కాన్సస్, ఒహియో, వ్యోమింగ్, నార్త్ డకోట, సౌత్ డకోట, నెబ్రాస్కా, ఒక్లహామా, లుసియానా, వెస్ట్ వర్జీనియా, అలబామా, టెక్సాస్, మిస్సోరీ, మోంటానా, కాన్సస్, ఒక్లాహామా, అయోవా, ఐడాహో రాష్ట్రాల్లో గెలుపొందారు. అదే విధంగా కమలాహారిస్ ఇల్లినాయిస్, మేరీలాండ్, వెర్‌మౌంట్, న్యూయార్క్, మస్సాచుసెట్స్, కన్నెటిక్టికట్, రోడ్ ఐలాండ్లో, డెలావర్, న్యూజెర్సీ, కొలరాడో, న్యూమెక్సికో, వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో గెలుపొందారు.
పెరుగుతున్న ఉత్కంఠ
వైట్ హౌస్ లో మొత్తం 538 ఓట్లు ఉండగా.. విజయం సాధించాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. ఇప్పటి వరకు వెల్లడవుతున్న ఫలితాల మేరకు 393 ఓట్లలో 241 ఓట్లు ట్రంప్ కు రాగా, 179 ఓట్లు కమలాకు దక్కించుకున్నారు. ఇక, కౌంటింగ్ వేళ పెన్సిల్వేనియాలో ఓటింగ్ పై ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేసారు. అక్కడ మోసం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ట్రంప్ విజయం వైపు దూసుకెళ్తున్న క్రమంలో కమలా అనూహ్యంగా పుంజుకోవటం.. ఇప్పిటికీ అనేక రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య హోరా హోరీ పోరు కొనసాగుతుండటంతో తుది ఫలితం పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఫలితాల్లో మారుతున్న ట్రెండ్స్ ను ఆసక్తిగా గమనిస్తున్నారు.

-
ఖమేనీ సంధి ఒప్పందం? -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications