దూసుకెళ్తున్న ట్రంప్ - హ్యారీస్ కు ఛాన్స్, అక్కడే కీలకం..!!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేదెవరు. ప్రపంచం మొత్తం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయి కౌంటింగ్ కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్ లో ట్రంప్ దూకుడు మీద ఉన్నారు. అదే విధంగా హ్యారీస్ వెంటాడుతున్నారు. పలు రాష్ట్రాల్లో హోరా హోరీ సమరం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ట్రంప్ 17 రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఎనిమిది రాష్ట్రాల్లో హ్యారీస్ ముందంజలో ఉన్నారు. మారుతున్న ట్రెండ్స్ ఫలితాల పై మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి.
తాజా ట్రెండ్స్
ప్రపంచం అంతా అమెరికా వైపు చూస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో నిమిష నిమిషానికి ట్రెండ్స్ మారి పోతున్నాయి. ట్రంప్ ఆధిపత్యం కొనసాగుతున్నా.. హ్యారీస్ సైతం దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు ట్రంప్ 17 రాష్ట్రాల్లో గెలుపొందారు. హ్యారీస్ 9 రాష్ట్రాల్లో విజయం సాధించారు.
అలబామా, ఆర్కాన్సాస్, ఫ్లోరిడా,ఇండియానా, కెంటకీ, మిసిసిపి, ఓక్లహోమా, టెన్నెసీ
వెస్ట్ వర్జీనియా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ హవా కొనసాగింది. అదే విధంగా...కనెక్టికట్, డెలవేర్, ఇల్లినోయీ, మసాచుసెట్స్, మేరీల్యాండ్, న్యూజెర్సీ, రోడ్ ఐల్యాండ్, వెర్మాంట్ లో హ్యారీస్ తన సత్తా నిరూపించారు.

ఆ రాష్ట్రాలే హ్యారీస్ కు కీలకం
కాగా, డొనాల్డ్ ట్రంప్ 101 ఎలక్టోరల్ ఓట్లు, హారిస్‌కు 71 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. మెజార్టీ రాష్ట్రాల్లో ట్రంప్‌దే ఆధిక్యం కొనసాగుతోంది. పోలింగ్ పూర్తయ్యే వేళ పలు ప్రాంతాల్లో ఆసక్తి కర పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. పలు రాష్ట్రాల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నువ్వు-నేనా అన్నట్టుగానే ఇప్పటికీ కనిపిస్తోంది. మేజిక్ ఫిగర్ 270గా ఉంది. ఎర్లీ ట్రెండ్స్ లో ట్రంప్ 198, హ్యారీస్ 99 తో కొనసాగుతున్నారు. అయితే, ఇద్దరి మధ్య కొన్ని రాష్ట్రాల్లో హోరా హోరీగా ఓట్లు వస్తుండటంతో.. తుది ఫలితం పైన ఇంకా ఉత్కంఠ పెరిగిపోతోంది. తాజా అంచనాల మేరకు కమలా హ్యరీస్ మిచిగాన్, పెన్సిల్వినేయాలో విజయం సాధిస్తే అధ్యక్ష రేసులో తుది విజయం కు ఛాన్స్ ఉంటుంది.
మారుతున్న అంచనాలు
పెన్సిల్వేనియాలో హ్యారీస్ ఆధిక్యానికి ట్రంప్ గండికొట్టారు. అదే విధంగా ఆరిజోనాలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నారు. మొత్తం మీద 48 శాతం మంది ట్రంప్ కు అనుకూలంగా ఉందని తాజా ట్రెండ్స్ తో పోల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆరిజోనాలో 51.9 శాతం, నెవడాలో 51.4, నార్త్ కరోలినాలో 50.4 శాతం ట్రంప్‌నకు మద్దతు దక్కింది. సర్వేల అంచనాలకు భిన్నంగా పలు రాష్ట్రాల్లో ఫలితాలు వెల్లడవుతున్నాయి. అయితే, ఇంకా కౌంటింగ్ కొనసాగుతుండటంతో...తాజా అంచనాలు మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో, ఈ సాయంత్రానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఎవరదినేది స్పష్టత రానుంది.













Click it and Unblock the Notifications