వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్-జో బైడెన్ భేటీ: జోక్స్, నవ్వులు!

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా అధికార మార్పిడి సజావుగా సాగేందుకు సహకరించుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. కాగా, అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత.. గెలిచిన వారితో అధ్యక్షుడు భేటీ కావడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే, 2020లో ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్.. విజయం సాధించిన జో బైడెన్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించకపోవడం గమనార్హం.

Donald Trump Joe Biden meet at White House Debate on transition of power

అంతేగాక, బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి కూడా ట్రంప్ హాజరు కాలేదు. అయినప్పటికీ.. జో బైడెన్ మాత్రం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ట్రంప్‌‌నకు ఆహ్వానం పంపారు. ఈ నేపథ్యంలో వైట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ భేటీ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌నకు జో బైడెన్ అభినందనలు తెలిపారు. అధికార బదిలీ సాఫీగా సాగేందుకు సహరిస్తామని చెప్పారు. ఇందుకు డొనాల్డ్ ట్రంప్.. జో బైడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు. 'రాజకీయం చాలా కఠినమైనది. చాలా సందర్భాలలో ఇది మంచి ప్రపంచం కాదు, కానీ ఈ రోజు ఇది ఒక అందమైన ప్రపంచం' అని డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చిన్నపాటి జోక్స్ వేసుకుని నవ్వుకున్నారు ఇరువురు నేతలు.

కాగా, ఎన్నికల సమయంలో బైడెన్, ట్రంప్ పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. 81 ఏళ్ల బిడెన్ ట్రంప్‌ను ప్రజాస్వామ్యానికి ముప్పుగా అభివర్ణించగా.. 78 ఏళ్ల ట్రంప్.. బిడెన్‌ను అసమర్థుడిగా అభివర్ణించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ పోటీ పడగా.. ట్రంప్ ఘన విజయం సాధిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+