ఇంత కక్కుర్తి ఏందయ్యా.. నమ్ముకుంటే నట్టేట ముంచిన ట్రంప్!
Donald Trump: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అమెరికా పర్యటన.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన జరిపిన సమావేశం ఇజ్రాయెల్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో వెలువడిన కొన్ని ప్రకటనలపై ఇజ్రాయెల్ మీడియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా రక్షణ, పెట్టుబడి అంశాలపై ఇజ్రాయెల్ భద్రతాపరమైన ఆందోళనలను ప్రస్తావిస్తోంది.
F-35 ఫైటర్ జెట్ల ప్రకటనతో ఇజ్రాయెల్ ఆందోళన
మహ్మద్ బిన్ సల్మాన్ వైట్‌హౌస్‌కు చేరుకున్నప్పుడు ఆయన ఒక దేశాధినేతకు దక్కే స్థాయిలో స్వాగతం పొందారు. ఈ సమావేశంలో పెట్టుబడి, రక్షణ అంశాలపై చర్చలు జరిగాయి. ఇందులో అత్యంత కీలక ప్రకటన చేశారు. అదే సౌదీ అరేబియా దేశానికి F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ల సరఫరా. F-35 అనేది ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఫైటర్ జెట్. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం ఈ జెట్లు కేవలం ఇజ్రాయెల్ వద్ద మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియాకు 48 ఫైటర్ జెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన ఇజ్రాయెల్‌ను కలవరపెట్టింది. దీనివల్ల మధ్యప్రాచ్యంలో తమ సైనిక ఆధిపత్యం దెబ్బతింటుందని ఇజ్రాయెల్ వాదిస్తోంది.

ఓ రిపోర్టర్ "సౌదీకి ఇచ్చే F-35 జెట్‌లు ఇజ్రాయెల్ ఉపయోగించే మోడల్ లాగే ఉంటాయా?" అని అడిగినప్పుడు.. ట్రంప్ "అవును, రెండూ చాలా వరకు ఒకేలా ఉంటాయని నేను అనుకుంటున్నాను" అని బదులిచ్చారు. "సౌదీ అరేబియా గొప్ప భాగస్వామి, ఇజ్రాయెల్ కూడా గొప్ప భాగస్వామి. ఇజ్రాయెల్ సౌదీకి కొంచెం తక్కువ సామర్థ్యం గల జెట్ రావాలని కోరుకుంటుందని నాకు తెలుసు. కానీ సౌదీ దానితో సంతోషంగా ఉండదని నేను అనుకోను" అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
సౌదీ భారీ పెట్టుబడులపై చర్చ
ఈ పర్యటనలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అమెరికాలో భారీ పెట్టుబడులపై మొగ్గు చూపారు. డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ సందర్భంగా.. సౌదీ అరేబియా అమెరికాలో తమ పెట్టుబడులను 600 బిలియన్ డాలర్ల నుంచి ట్రిలియన్ డాలర్లకు పెంచుతుందని క్రౌన్ ప్రిన్స్ ప్రకటించారు. ఈ పెట్టుబడులు ప్రధానంగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, అధునాతన తయారీ రంగంపై దృష్టి సారించనున్నాయి.
ఆందోళనలో ఇజ్రాయెల్ మీడియా
ట్రంప్-మహ్మద్ బిన్ సల్మాన్ భేటీకి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ఇజ్రాయెల్ మీడియా ప్రధానంగా కవర్ చేసింది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రకారం.. ఇజ్రాయెల్ ప్రభుత్వం సౌదీకి F-35 జెట్‌లు ఇవ్వడానికి అభ్యంతరం లేదని, అయితే బదులుగా అబ్రహం ఒప్పందంలో చేరాలనే షరతు పెట్టాలని అమెరికాను కోరింది. కానీ "ట్రంప్ ఇజ్రాయెల్ మాటను కాదని డీల్‌పై ముందుకు సాగారు" అని పత్రిక రాసింది. ఈ డీల్ వల్ల ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక ఆధిపత్యానికి నష్టం జరుగుతుందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF), అమెరికన్ గూఢచార అధికారుల ఆందోళనలను ట్రంప్ పట్టించుకోలేదని ఆ పత్రిక విమర్శించింది.
-
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్












Click it and Unblock the Notifications