డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ కాల్పులు: ఏకే 47

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం చోటు చేసుకుంది. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో సంభవించిన ఈ పరిణామం.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందిన వెంటనే సీక్రెట్ సర్వీస్ రంగంలోకి దిగింది. షూటర్‌ను అరెస్ట్ చేసింది. ఏకే 47ను స్వాధీనం చేసుకుంది.

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు చోటు చేసుకోవడం సరిగ్గా రెండు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. జులై 13వ తేదీన పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఆయనపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. వెంట్రుకవాసిలో మృత్యువాత నుంచి తప్పించుకున్నారాయన. బుల్లెట్ ఆయన కుడిచెవిని రాసుకుంటూ దూసుకెళ్లింది.

Donald Trump narrowly survived yet another assassination

ఇప్పుడు తాజాగా మరోసారి కాల్పులు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ఫ్లోరిడా వెస్ట్ పామ్ బీచ్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో ఈ ఘటన సంభవించింది. ఈ గోల్ఫ్ క్లబ్ ఆయనదే.

గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని షూటర్.. కాల్పులు జరిపాడు. గోల్ఫ్ క్లబ్ చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను దాటుకుని అతను లోనికి ప్రవేశించగలిగాడు. 300- 400 మీటర్ల దూరం నుంచి బుల్లెట్ల వర్షాన్ని కురిపించాడు.

ఈ ఘటనలో ట్రంప్ సురక్షితంగా బయటపడ్డారు. పెన్సిల్వేనియా ఎన్నికల ర్యాలీ తరహాలో ఎలాంటి గాయాలు కాలేదు. తాను క్షేమంగా ఉన్నానంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ స్టేట్‌మెంట్‌ను తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

Donald Trump narrowly survived yet another assassination

కాల్పుల శబ్దం వినిపించిన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తం అయ్యారు. షూటర్‌పై నాలుగు నుంచి ఆరు రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. అక్కడి నుంచి అతను తప్పించుకున్నాడు. అతని ఫొటో, వెస్ట్ పామ్ బీచ్ వద్దకు చేరుకోవడానికి వినియోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దీని ఆధారంగా షూటర్‌ను గుర్తించినట్లు వెస్ట్ పామ్ బీచ్ కంట్రీ షెరిఫ్ రిక్ బ్రాడ్‌షా తెలిపారు. షూటర్ పేరు ర్యాన్ రౌత్‌‌. వయస్సు 58 సంవత్సరాలు. హవాయ్ నివాసి. ట్రంప్‌పై కాల్పులు జరిపాడని, కాల్పుల శబ్దం విన్న వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారని వివరించారు. దీనితో తాను వినియోగించిన ఏకే 47ను అక్కడే వదిలి పారిపోయాడని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+