డొనాల్డ్ ట్రంప్ ప్రీ-ప్లాన్డ్: నిక్కీ హేలీకి బిగ్ షాక్
Donald Trump: ఇటీవలే ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ఇక ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేసుకుంటోన్నారు. 47వ అధ్యక్షుడిగా వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అధ్యక్షుడిగా ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేయనున్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా ముగిసింది. 295 ఎలక్టోరల్ ఓట్లతో సునామీ సృష్టించారు డొనాల్డ్ ట్రంప్. 50.70 శాతం ఓట్లతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆయనకు పోల్ అయిన మొత్తం ఓర్ల సంఖ్య ఏడు కోట్లను దాటింది. 7,32,98,740గా లెక్క తేలింది.డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు పడ్డ ఓట్ల శాతం 47.70. మొత్తంగా 6,89,71,195 ఓట్లకే ఆమె పరిమితం కావాల్సి వచ్చింది.

ఈ విజయం ఇచ్చిన ఊపులో ఉన్న డొనాల్డ్ ట్రంప్.. వైట్ హౌస్‌లో దర్జాగా అడుగు పెట్టబోతున్నారు. దీనికి ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నెల 13వ తేదీన అధ్యక్షుడి అధికారిక నివాసానికి వెళ్లనున్నారు. ఆ దేశ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు.
ఈ మేరకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరిన్ జీన్- పెర్రీ ఓ ప్రకటన విడుదల చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను జో బైడెన్ వైట్ హౌస్‌కు ఆహ్వానించారని, దీనికి ఆయన అంగీకరించారని పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 11 గంటలకు వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో వారిద్దరూ భేటీ అవుతారని చెప్పారు.
ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం రూపు రేఖలు ఎలా ఉండాలనే విషయంపైనా డొనాల్డ్ ట్రంప్ కసరత్తు మొదలు పెట్టారు కూడా. మాజీ మంత్రులు నిక్కీ హేలీ, మైక్ పాంపియోలకు చెక్ పెట్టారు. వారిద్దరినీ తీసుకోవట్లేదని వెల్లడించారు. వారిద్దరికీ తన అడ్మినిస్ట్రేషన్ టీమ్‌లో చోటు లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ ప్లాట్‌ఫామ్‌పై ఓ సమాచారాన్ని పోస్ట్ చేశారు.
2016-2020 మధ్యకాలంలో అధికారంలో ఉన్న ట్రంప్ ప్రభుత్వంలో నిక్కీ హేలీ, మైక్ పాంపియో కీలక శాఖలకు మంత్రులుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. నిక్కీ హేలీ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా వ్యవహరించారు. మైక్ పాంపియో హోం బాధ్యతలను పర్యవేక్షించారు.
ఆ తరువాత వారిద్దరూ కూడా అధ్యక్ష ఎన్నికల రేసులో నిల్చున్నారు. అభ్యర్థిని ఎంపిక చేసుకోవడానికి రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన అంతర్గత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో పోటీ పడ్డారు. వివేక్ రామస్వామి అప్పట్లో బరిలో దిగారు. ఆ తరువాత వారందరూ కూడా తప్సుకొన్నారు. ట్రంప్‌కు తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
-
ఖమేనీ సంధి ఒప్పందం? -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications