డొనాల్డ్ ట్రంప్‌ను కోర్టుకు ఈడ్చిన పోర్న్‌స్టార్ ఎవరు? కథేంటీ?

వాషింగ్టన్: అమెరికన్ టాప్ పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపుల వ్యవహారంలో అరెస్ట్‌ను ఎదుర్కొంటోన్న వేళ.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కోర్టులో లొంగిపోనున్నారు. తన అరెస్ట్ తప్పదంటూ ఆయన ఇదివరకే స్పష్టం చేశారు. తనకు అండగా నిలవాలంటూ మద్దతుదారులకు పిలుపునిచ్చారు. నిరసన ప్రదర్శనలను చేయాలని సూచించారు. అక్రమ చెల్లింపుల కేసులో మన్‌హట్టన్ న్యాయస్థానం తీర్పు వెలువడించే అవకాశం ఉన్న నేపథ్యంలో- ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆయనపై ఉన్న ఆరోపణలు రుజువైతే అమెరికాలో ఒక మాజీ అధ్యక్షుడికి ప్రత్యక్ష ప్రమేయం ఉన్న తొలి క్రిమినల్ కేసు ఇదే అవుతుంది. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఎన్నికల కంటే ముందే టాప్ అమెరికన్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌ (Porn Star Stormy Daniels)తో తనకు ఉన్న సంబంధాలు బయటికి రాకుండా జాగ్రత్తపడ్డారు.

Who is Stormy Daniels

ఇంతకీ ఎవరీ పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్?.. 2024 నాటి అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్న 76 సంవత్సరాల డొనాల్డ్ ట్రంప్‌ను మన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ క్రిమినల్ కోర్టు వరకూ ఎందుకు తీసుకుని రాగలిగంది? సరెండర్ కావాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

స్టార్మీ డేనియల్స్ అసలు పేరు- స్టెఫానీ క్లిఫొర్డ్. లూసియానా స్టేట్‌లోని బ్యాటన్ రూజ్ ఆమె స్వస్థలం. సుదీర్ఘకాలంగా ఆమె పోర్న్ మూవీల్లో నటిస్తోన్నారు. సుమారు 20 సంవత్సరాలుగా ఆమె అడల్ట్ ఫిల్మ్స్‌లల్లో నటిస్తోన్నారు. పోర్న్ మూవీలకు దర్శకత్వం వహించారు. మాజీ స్ట్రిప్పర్ కూడా. నాలుగేళ్ల వయస్సులో తల్లిదండ్రులు షెయ్లా, బిల్ గ్రెగరీ విడిపోయారు. దీనితో తల్లి వద్ద పెరిగారు. బ్యాటన్ రూజ్‌లోని స్కాట్లాండ్‌విల్లే మాగ్నెట్ హైస్కూల్‌లో చదివారు.

దిగువ మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆదాయం కోసం బ్యాటన్ రూజ్‌లోని గోల్డ్ క్లబ్‌లో స్ట్రిప్పర్‌గా చేరారు. 2004లో అడల్ట్ మూవీల్లో నటించడం మొదలుపెట్టారు. పలు పోర్న్ మూవీల్లో నటించారు. అడల్ట్ ఫిల్మ్ బిజినెస్‌లో స్థిరపడ్డారు. ట్రంప్‌తో ఏర్పడిన పరిచయం, రిలేషన్‌షిప్‌పై 2018లో తొలిసారిగా స్టార్మీ డేనియల్స్ స్పందించారు. 60 మినిట్స్ అనే ప్రోగ్రామ్‌లో భాగంగా సీబీఎస్ మీడియా హౌస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను బయటపెట్టారు.

2006లో ట్రంప్‌తో పరిచయం ఏర్పడిందని, అదే ఏడాది జులైలో లేక్ టహోవెలో నిర్వహించిన ఓ గోల్ఫ్ టోర్నమెంట్‌ సందర్భంగా తనను డిన్నర్‌కు ఆహ్వానించాడని, పరస్పర అంగీకారంతో ఇద్దరూ సెక్స్‌లో పాల్గొన్నామని తెలిపారు. ఆ తరువాత తరచూ కలుసుకునే వాళ్లమని, ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లమని అన్నారు. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయనున్నట్లు మీడియా ద్వారా తనకు తెలిసిందని వివరించారు. తనతో ఉన్న సెక్స్ రిలేషన్‌ను బయటపెట్టకుండా ఉండటానికి తన లాయర్ ద్వారా 1.30 లక్షల డాలర్లను చెల్లించాడని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+