ఓటర్ల జాబితాలో మహిళగా రిజిస్టర్ చేయించుకున్న ట్రంప్ అల్లుడు
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, ఇవాంకా ట్రంప్ భర్త జారెడ్ కుష్నర్ తన ఓటు హక్కును మహిళగా రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ మేరకు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి.
అమెరికా: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, ఇవాంకా ట్రంప్ భర్త జారెడ్ కుష్నర్ తన ఓటు హక్కును మహిళగా రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ మేరకు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి.
చదవండి: బీబీసీకి షాకిచ్చిన ఉత్తర కొరియా, కిమ్ ప్రవర్తనపై ట్రంప్ ఆగ్రహం
డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు ఈ విషయాన్ని ఇటీవలే తెలుసుకున్నట్లు ది హిల్ పేర్కొంది. న్యూజెర్సీ ప్రాంతానికి చెందిన కుష్నర్ 2009 నవంబర్లో న్యూయార్క్ ఓటర్ల జాబితాలో తన అలవాటులో పొరపాటుగా తనను తాను మహిళగా పేర్కొన్నాడు.

కుష్నర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రథమ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ట్రంప్‌కు జారెడ్ కుష్నర్ సీనియర్ సలహాదారుగా సేవలందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికన్ బ్రిడ్జ్ ప్రతినిథి బ్రాడ్ బెయినమ్ మాట్లాడుతూ కుష్నర్ చాలా చిన్న దరఖాస్తును కూడా తప్పుల్లేకుండా నింపలేకపోయారన్నారు. అలాంటి వ్యక్తి మిడిల్ ఈస్ట్‌కు శాంతిని తీసుకొస్తారని ఎవరైనా ఎలా అనుకుంటారన్నారు.
దీనిపై కుష్నర్ స్పందించారు. తన అసిస్టెంట్‌కు సరైన విధంగా సమాచారాన్ని ఇవ్వకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగిందని చెప్పారు.












Click it and Unblock the Notifications