భారత్- పాక్ యుద్ధ విమానాల కూల్చివేత- ట్రంప్ కొత్త వివాదం?
భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాత వైఖరిని ప్రదర్శిస్తోన్నారు. భారత్ తో కుదుర్చుకోవడం సహా పలు అంశాలపై ఆయన పదే పదే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తోన్నారు. భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే నిలిపివేశానంటూ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొన్న ఆయన.. దాన్నే తాజాగా పునరుద్ఘాటించారు.
పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను నిలిపివేయడానికి ట్రేడ్ డీల్ ను తెర మీదికి తెచ్చినట్లు గతంలో పలుమార్లు చెప్పుకొంటూ వచ్చారు డొనాల్డ్ ట్రంప్. సౌదీ అరేబియా, నెదర్లాండ్స్ వంటి విదేశీ పర్యటనల సమయంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. యుద్ధాన్ని కొనసాగిస్తే ట్రేడ్ డీల్ ను కుదుర్చుకోబోమంటూ అప్పట్లో హెచ్చరించారు.

ఇప్పుడు తాజాగా మరోసారి అదే వాదన వినిపించారు డొనాల్డ్ ట్రంప్. వైట్‌హౌస్ స్టేట్ డైనింగ్ రూమ్‌లో రిపబ్లికన్ సెనేటర్ల కోసం ఏర్పాటు చేసిన విందులో ఆయన ప్రసంగించారు. మే లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా అయిదు జెట్ ఫైటర్లను కూల్చివేశారని అన్నారు. తన జోక్యంతోనే ఆ పోరు ముగిసిందని పునరుద్ఘాటించారు.
ఏయే దేశాలు ఆ యుద్ధ విమానాలను కోల్పోయాయనే విషయంపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. రెండు దేశాల ఉమ్మడి నష్టాల గురించి కూడా వివరించలేదు. అమెరికా మధ్యవర్తిత్వం లేకుండానే సైనిక చర్యలను నిలిపివేశామని భారత్ పలుమార్లు స్పష్టం చేసింది. ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చల ఫలితంగానే కాల్పులు ఆగాయని పేర్కొంది.
భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో జెట్ ఫైటర్లు కూల్చివేతకు గురయ్యాయని, అవి నాలుగు లేదా అయిదు వరకు ఉండొచ్చని అన్నారు. పరిస్థితి మరింత దిగజారిపోతోందని తాను భావించానని ట్రంప్ అన్నారు. ఈ రెండూ అణు దేశాలు కావడం మరింత ఆందోళనకు గురి చేసిందని చెప్పారు.
దీనితో ట్రేడ్ డీల్ అంశాన్ని తాను తెర మీదికి తీసుకొచ్చానని ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలనుకుంటున్నట్టయితే ఇలా పరస్పరం యుద్ధానికి దిగడం, అణ్వాయుధాలు ప్రయోగించడం కుదరదని భారత్- పాక్ లకు తేల్చి చెప్పానని ట్రంప్ వ్యాఖ్యానించారు.
తాము ఆరు నెలల్లో చేసిన పనిని ఇతర ప్రభుత్వాలు ఎనిమిది సంవత్సరాల్లో కూడా చేయలేవని ఆయన అన్నారు. తాము చాలా యుద్ధాలను ఆపామమని, అన్నీ తీవ్రమైనవేనని ట్రంప్ పేర్కొన్నారు. ఇలా యుద్ధాలను ఆపాల్సి రావడం తనకు గర్వకారణమని చెప్పుకొచ్చారు.
-
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications