ఇరాన్ వెనుక చైనా హస్తం?: ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్!

ఇరాన్‌కు చైనా రహస్యంగా ఆయుధాలను సరఫరా చేస్తోందన్న నివేదికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఒకవేళ చైనా గనుక ఇరాన్‌కు ఆయుధాలను పంపితే ఆ దేశం పెద్ద సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఈ విషయంలో చైనా పర్యవసానాలు అనుభవించక తప్పదని స్పష్టం చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న బలహీనమైన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.

రహస్యంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్
అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం.. చైనా తన అధునాతన వాయు రక్షణ వ్యవస్థలను మూడో దేశాల ద్వారా ఇరాన్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా భుజంపై నుంచి ప్రయోగించే యాంటీ ఎయిర్ మిసైల్ వ్యవస్థలు ఈ ప్యాకేజీలో ఉండవచ్చని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల దెబ్బతిన్న తన రక్షణ వ్యవస్థలను ఇరాన్ వేగంగా పునర్నిర్మించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో చైనా సహకారం తీసుకోవడంపై అమెరికా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Donald Trump Warns China Big Problems if Arms Sent to Iran US-China-Iran Tensions 2026

అమెరికా ఆరోపణలను ఖండించిన చైనా
అమెరికా చేస్తున్న ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించింది. తాము ఏ దేశానికి లేదా వివాదంలో ఉన్న ఏ పక్షానికి ఆయుధాలను సరఫరా చేయలేదని వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ సంచలనాన్ని సృష్టిస్తోందని చైనా మండిపడింది. వచ్చే నెలలో డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు వెళ్లి అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్న తరుణంలో ఈ ఆయుధ సరఫరా ఆరోపణలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.

చర్చల మధ్య ఉద్రిక్తత:
మరోవైపు ఇరాన్‌తో అమెరికా "లోతైన చర్చలు" జరుపుతోందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందం కుదిరినా కుదరకపోయినా అమెరికాకు వచ్చే నష్టం ఏమీ లేదని.. చివరికి తామే గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ ఇప్పటికే సముద్ర జలాల్లో కొన్ని మైన్లను ఉంచిందని, వాటిని తొలగించేందుకు అమెరికా నౌకలు నిరంతరం పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు. అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ సమీపంలో మోహరించి ఉన్న తరుణంలో చైనా నుంచి ఇరాన్‌కు వచ్చే ఏ చిన్న సైనిక సహాయమైనా ఉద్రిక్తతలను యుద్ధ స్థాయికి తీసుకెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+