Donald Trump: కాల్పుల విరమణకు ఉక్రెయిన్ సిద్ధం.. ఇక మిగిలింది పుతిన్ నిర్ణయమే..

Donald Trump: రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య 3 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న యుద్ధం ముగింపు దశకు వచ్చినట్లు కనిపిస్తోంది. సౌదీ అరేబియాలో అమెరికా అధికారులతో జరిగిన చర్చల తర్వాత ఉక్రెయిన్ 30 రోజుల తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించింది. 8 గంటల చర్చల అనంతరం అమెరికా అధికారులు దీనిని ప్రకటించారు. ఇప్పుడు బంతి రష్యా కోర్టులో ఉందని చెప్పారు. ఈ ప్రతిపాదన ఇప్పుడు రష్యా ముందు ఉంచబడుతుంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. రష్యా కూడా దీనికి అంగీకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ భయంకరమైన యుద్ధం రష్యా, ఉక్రెయిన్ సైనికులు అనేక మంది చనిపోయారని.. ఈ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నామని.. అందులో భాగంగా కాల్పుల విరమణ చాలా ముఖ్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అంగీకరించిందని.. ఇది మిగిలింది రష్యానే అని.. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ దీనికి అంగీకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. దీనిపై పుతిన్ తో మాట్లాడతానని ట్రంప్ పేర్కొన్నారు. వాళ్లు దీనికి ఒప్పుకోకపోతే అనేక మంది ప్రజలు చనిపోతారని ఆయన తెలిపారు. ఈ వారం రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడతానని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కూడా చర్చల కోసం మళ్లీ వైట్ హౌస్ ఆహ్వానిస్తామని ట్రంప్ ప్రకటించారు.

Donald Trump Welcomes Ukraine s Agreement for Ceasefire Expects Putin s Response

అమెరికా చర్చల్లో కుదిరిన ఒప్పందం
సౌదీ అరేబియాలోని జెడ్డాలో అమెరికా, ఉక్రెయిన్ అధికారుల మధ్య సమావేశం జరిగిన తర్వాత రెండు దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. 30 రోజుల కాల్పుల విరమణను అమలు చేయాలనే అమెరికా ప్రతిపాదనకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని.. ఈ క్రమంలో ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై రష్యాతో అమెరికా చర్చలు జరపాల్సి ఉంది. ఉక్రెయిన్ రష్యాపై భారీ డ్రోన్ల దాడి చేసిన ఒకరోజు తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. రష్యాలోని కీలక ప్రాంతాలపై రష్యా దాదాపు 350 డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా.. 18 మంది గాయపడ్డారు. దీనికి ప్రతిస్పందనగా రష్యా ఉక్రెయిన్ లోని ఒడెస్సా నగరంపై దాడి చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది.

రష్యా ముందుకు ప్రతిపాదన
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఫలితాలకు సంబంధించి అమెరికా ఇప్పుడు రష్యాతో చర్చలు జరపనుంది. సౌదీలో సమావేశం అనంతరం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ.. ఈ విషయం గురించి రష్యాతో చర్చిస్తామని అన్నారు. ఉక్రెయిన్ కాల్పులు ఆపివేసి చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఇప్పుడు బంతి రష్యా కోర్టులోనే ఉందన్నారు. యుద్ధాన్ని ముగించడానికి ఏకైక మార్గం చర్చల ద్వారానే అని ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+