వైట్ హౌస్‌లో ఎవరీ కొత్త మహిళ?- యూఎస్ చరిత్రలోనే తొలిసారి: ట్రంప్ తొలి సంతకం

Donald Trump: ఇటీవలే ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ఇక ప్రమాణ స్వీకారానికి సమాయాత్తమౌతోన్నారు. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అధ్యక్షుడిగా ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేయనున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడాయన.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా ముగిసింది. 295 ఎలక్టోరల్ ఓట్లతో సునామీ సృష్టించారు డొనాల్డ్ ట్రంప్. 50.70 శాతం ఓట్లతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆయనకు పోల్ అయిన మొత్తం ఓర్ల సంఖ్య ఏడు కోట్లను దాటింది. 7,32,98,740గా లెక్క తేలింది. ఈ ఎన్నికలను ట్రంప్ ఏకపక్షంగా మార్చివేశారు.

Donald Trump s campaign manager Susie Wiles appointed as Chief of Staff

డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు పడ్డ ఓట్ల శాతం 47.70. మొత్తంగా 6,89,71,195 ఓట్లకే ఆమె పరిమితం కావాల్సి వచ్చింది. 2019 నాటి ఎన్నికల్లో డెమోక్రాట్లకు పట్టం కట్టిన కొన్ని కీలక రాష్ట్రాలు ఈ దఫా స్వింగ్ అయ్యాయి. రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపాయి.

ఈ స్థాయిలో రిపబ్లికన్ పార్టీని గెలిపించడంలో కీలకంగా వ్యవహరించారు సుసీ విల్స్. డొనాల్డ్ ట్రంప్ ప్రచార కార్యక్రమాల అధినేత్రి. ఆమె పర్యవేక్షణలోనే ట్రంప్ ఎన్నికల ప్రచార ర్యాలీలు కొనసాగాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి ర్యాలీలను నిర్వహించాల్సి ఉంటుందనే విషయాలపై సమగ్ర షెడ్యూల్‌ను రూపొందించింది ఆమెనే. దానికి అనుగుణంగా ట్రంప్ ర్యాలీలు కొనసాగాయి.

ఎన్నికల ప్రక్రియ ముగిసీ ముగియంగానే సుసీ విల్స్‌కు తన ప్రభుత్వంలో కీలక పదవిని అప్పగించారు డొనాల్డ్ ట్రంప్. ఆమెను తన అధికారిక నివాసం వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా అపాయింట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆయన సంతకం చేశారు. ఎన్నికల తరువాత పెట్టిన తొలి సంతకం ఇదే.

వైట్ హౌస్ చరిత్రలో ఇప్పటివరకు ఏ మహిళ కూడా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా అపాయింట్ కాలేదు. ఈ బాధ్యతలను స్వీకరించడంతో సుసీ విల్స్ కొత్త రికార్డును నెలకొల్పనున్నారు. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌‌గా నియమితులైన మొట్టమొదటి మహిళగా చరిత్రకెక్కున్నారు.

నాలుగు సంవత్సరాలుగా డొనాల్డ్ ట్రంప్‌ అసోసియేట్‌గా కొనసాగుతున్నారు సుసీ విల్స్. ఆమె మీద పూర్తి నమ్మకంతోనే ఈ ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు. క్యాంపెయిన్ ఆపరేషన్స్‌కు హెడ్‌గా నియమించారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదు సుసీ.

అమెరికా చరిత్రలో నిలిచిపోయేలా తన విజయాన్ని మలచడంలో సుసీ విల్స్ కీలక పాత్రను పోషించారని ట్రంప్ ప్రశంసించారు. ఆమె సారథ్యంలో రిపబ్లికన్ పార్టీ అతి గొప్ప విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. ఆమె తీసుకున్న నిర్ణయాలన్నీ సఫలం అయ్యాయని, అందుకే చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమిస్తున్నానని చెప్పారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఓ మహిళకు ఈ పదవిని అప్పగించానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+