తన ఇంటిపై జరిగిన డ్రోన్ దాడి నుంచి తాను సురక్షితంగా తప్పించుకున్నట్లు ఇరాక్‌ ప్రధానమంత్రి ముస్తఫా అల్ కథిమి చెప్పారు.బాగ్దాద్‌లో కట్టుదిట్టమైన భద్రత ఉండే గ్రీన్ జోన్‌లో ముస్తఫా ఇల్లు ఉంది. ప్రధాని నివాసం పరిసరాల్లో ఎన్నో ప్రభుత్వ భవనాలు, విదేశీ రాయబార కార్యాలయాలు ఉన్నాయి.పేలుడు పదార్థాలతో కూడిన ఒక డ్రోన్ ప్రధాని ఇంటిలోకి దూసుకొచ్చిందని, అది పేలడంతో ఆరుగురు బాడీగార్డులు గాయపడ్డారని అధికారులు చెప్పారు. ప్రధాని హత్యకు డ్రోన్ దాడితో కుట్ర పన్ని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.ఎవరైనా నా ఇంటి తలుపు తట్టి 5 బుల్లెట్లను పేల్చవచ్చు.. నన్ను, నా కుటుంబాన్ని చంపేయొచ్చు’ప్రయాణికులు దిగిన తర్వాత ఈ విమానాన్ని ఇలా రన్‌వేపైనే ఎందుకు ముక్కలు చేశారుప్రజలందరూ సంయమనం పాటించాలని ప్రధాని ముస్తఫా అల్ కథిమి పిలుపునిచ్చారు.ఇటీవల ఎన్నికల ఫలితాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల తర్వాత ప్రధాని నివాసంపై ఈ డ్రోన్ దాడి జరిగింది.అమెరికా, ఇరాన్ ఈ దాడిని ఖండించాయి.ఈ దాడి తమ పనేనని ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించుకోలేదు.ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌‌గా పని చేసిన ముస్తఫా గతేడాది మేలో ప్రధాని పదవి చేపట్టారు.ఇరాన్‌ అనుకూల రాజకీయ గ్రూపులకు చెందిన మద్దతుదారులు కొందరు ఇటీవల గ్రీన్ జోన్‌లో ఆందోళనలు చేపట్టారు.గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలకు వ్యతిరేకంగా వాళ్లు నిరసన తెలుపుతున్నారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వాళ్లు ఆరోపిస్తున్నారు.గత వారం హింసాత్మక ఆందోళనల్లో, పోలీసులతో జరిగిన ఘర్షణల్లో సుమారు వంద మంది గాయపడ్డారు.సద్దాం హుస్సేన్‌ కూతురు రగద్: నా భర్తను మా నాన్నే చంపించారుజమ్మూ డ్రోన్ దాడి: ఈ తరహా దాడులను అడ్డుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందా?ఇరాక్ నడిబొడ్డున ఉగ్రవాద చర్యకు పాల్పడినట్లు అనిపిస్తోంది అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రిన్స్ అన్నారు.ఈ ఘటనపై విచారణకు అమెరికా సాయం చేస్తుందని ఆయన చెప్పారు.టెర్రరిస్టులు, ఆక్రమిత శక్తులను సృష్టించి, వాటికి కొన్ని విదేశీ థింక్ ట్యాంకులు సాయం చేస్తున్నాయంటూ ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ షంఖానీ ఆరోపించారు. వాటివల్ల ఇరాక్‌లో అస్థిరత్వం, అసమ్మతి, అభద్రత వస్తోందని ఆయన అన్నారు.ఇరాన్‌లో నీటి కోసం నిరసనలు, ఆ దేశం ఎందుకు ఎండిపోతోంది?స్వాతంత్ర్య సమరయోధుల జాబితాలో 387 మంది పేర్ల తొలగింపుపై వివాదంఇవి కూడా చదవండి:సూయజ్ కాలువను బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోకుండా అమెరికా ఎలా అడ్డుకుంది?నా వయసువారు చూడకూడని వీడియోలు ఉంటాయి అక్కడ’సూర్య జై భీమ్‌ తెర వెనుక అసలు కథ ఏంటి? రియల్ హీరో ఎవరు?ఉత్తర్ ప్రదేశ్: మూక దాడులు, హత్యలపై విచారణల్లో న్యాయం జరుగుతోందా? బాధితులు ఏమంటున్నారు?నో మ్యాన్స్ ల్యాండ్’లో యుద్ధ విమానం నుంచి భారత పైలట్ పడినప్పుడు ఏమైందంటే...సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’కోనసీమ పెను తుపాను @25: ఆ కాళరాత్రి మిగిల్చిన భయానక జ్ఞాపకాలు...కోవిడ్ 19: ఊపిరితిత్తులపై దాడి చేసి, ప్రాణాలు తీసే ప్రమాదకరమైన జన్యువుకార్పొరేట్ కంపెనీల లాభాలపై కనీసం 15 శాతం పన్ను.. భారత్‌కు లాభమా? నష్టమా?జై భీమ్: కొన్ని కలలు, కన్నీళ్లు - ఎడిటర్స్ కామెంట్కోవిడ్ టీకా: రెండో డోసు తీసుకోకపోతే మళ్లీ మొదటి డోసు వేయించుకోవాలా?(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)//