ప్రస్తుతం భూగోళం బరువు ఎంతుంటుందో తెలుసా?

Subscribe to Oneindia Telugu

లండన్ : ప్రస్తుతం భూగోళం బరువు ఎంత ఉండుంటుందో తెలుసా? అంచనా వేయడం సాధ్యమేనా? బ్రిటన్‌లోని లీసెష్టర్ యూనివర్సిటీకి చెందిన జియాలజిస్టులు మాత్రం సాధ్యమే అంటున్నారు. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా లీసెష్టర్ యూనివర్సిటీ జియాలజిస్టులు భూగోళం పరిమాణాన్ని అంచనా వేసి అందరిని విస్మయంలో ముంచెత్తారు.

Glob

లీసెష్టర్ జియాలిజిస్టుల అంచనా ప్రకారం.. ప్రస్తుతం భూగోళం పరిమాణం 30 లక్షల కోట్ల బరువు
(30ట్రిలియన్ టన్నులు). భూమి మిద ప్రతీ చిన్న నిర్మాణాన్ని పరిగణలోకి తీసుకొని జియాలిజిస్టులు ఈ అంచనాకు వచ్చారు. ఇళ్లు, ఫ్యాక్టరీలు, ఇతర నిర్మాణాలు, పొలాలు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, చెత్తచెదారం.. ఇలా భూగోళం మీదున్న ప్రతీదాన్ని పరిగణలోకి తీసుకుని భూమి బరువును నిర్దారించారు.

ఆంథ్రోపోసెనె రివ్యూ జర్నల్‌ ద్వారా ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత భూమి బరువు 30 ట్రిలియన్ టన్నులు అని జియాలిజిస్టులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే.. భూమి మీద చదరపు మీటరుకు 50 కేజీల బరువు ఉన్నట్టుగా స్పష్టమవుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An international team led by University of Leicester geologists has made the first estimate of the sheer size of the physical structure of the planet’s technosphere – suggesting that its mass approximates to an enormous 30 trillion tons.
Please Wait while comments are loading...