పాకిస్తాన్ సహా మూడు దేశాల్లో భూ ప్రకోపం
Tajakistan earthquake 2025: పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్‌లో వరుస భూకంపాలు సంభవించాయి. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించాయి. తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల తజకిస్తాన్‌లోనూ తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. దీనివల్ల ప్రాణ నష్టం చోటు చేసుకున్నట్లు సమాచారం లేదు.
కొన్ని చోట్ల ఆస్తినష్టం సంభవించింది. పలు నివాసాలు బీటలు వారాయి. కొన్ని పాక్షికంగా కూలిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ లో రెండు రోజుల్లో భూమి ప్రకంపించడం ఇది మూడోసారి. ఆ దేశ ఉత్తరప్రాంతంలోనే ఈ మూడు భూకంపాలు కూడా నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇప్పుడు తాజాగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులను పంచుకుంటోన్న తజకిస్తాన్ లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.0గా నమోదైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత సరిగ్గా 1:01 నిమిషాలకు 36.87 నార్త్ అక్షాంశం, 72.10 తూర్పు రేఖాంశం పరిధిలోకి వచ్చే తజకిస్తాన్ దక్షిణ ప్రాంతం గోర్నొ బదక్షన్ ప్రావిన్స్ లో భూమి కంపించింది.
ఉపరితలం నుంచి 160 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. ఈ ప్రావిన్స్.. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కు సమీపంలో ఉంటుంది. ఫలితంగా ఈ రెండు దేశాల్లో కూడా ప్రకంపనలు రికార్డయ్యాయి.
భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు. చాలా సేపటి వరకు రోడ్ల మీదే గడిపారు.
ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. కొన్ని చోట్ల పలు నివాసాలు బీటలు వారినట్లు వార్తలొస్తోన్నాయి. భూకంప కేంద్రం పాకిస్తాన్ తో సరిహద్దులను పంచుకుంటోన్నందున ఆ దేశంలోనూ తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి.
భారత్ చుట్టూ ఉన్న పాకిస్తాన్, చైనాతో ఆఫ్ఘనిస్తాన్ లో ఈ మధ్యకాలంలో తరచూ భూమి ప్రకోపిస్తోండటం చర్చనీయాంశమౌతోంది. నిజానికి- భూకంపాలు సంభవించే అవకాశం అత్యధికంగా ఉండే దేశాలతో కూడిన రింగ్ ఆఫ్ ఫైర్లో తజకిస్తాన్ లేదు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, యురేసియన్- ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల పరిధిలోకి వస్తుందీ దేశం.
కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, కోస్టారికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్.. రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలు.












Click it and Unblock the Notifications