Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అనకొండ పొట్టలోకి పాల్ వీడియోకు 4.1 మిలియన్ల వ్యూస్

న్యూయార్క్: అమెరికన్ ప్రకృతి ప్రేమికుడు పాల్ రొసోలీ అనకొండ నోట్లోకి వెళ్లిరావడం ఎంత సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇది డిస్కవరీ చానల్లో ప్రసారం అయింది. ఈ సాహసానికి సంబంధించిన వీడియోను ఆన్‌లైన్లో 4.1 మిలియన్ల మంది వీక్షించారట. ఆదివారం సాయంత్రం నాటికి ఆన్ లైన్లో అంతమంది చూశారట.

పదిహేను నిమిషాల నిడివి గల నేక్డ్ అండ్ అఫ్రైడ్ వీడియోను 2.3 మిలియన్ల మంది చూశారట. ఇందులో సెట్ రోజన్, జేమ్స్ ఫ్రాంకో నటించారు. అనకొండ పొట్టలో గడిపిన పాల్ రోసోలీ కార్యక్రమం పేరు 'ఈటెన్ అలైవ్'

ఈ కార్యక్రమంలో భాగంగా అమెజాన్ అడవుల్లో ఓ అనకొండను పాల్ రోసోలీ రెచ్చగొట్టాడు. అది అతడిని చుట్టేసింది. శరీరానికి రక్షణగా కార్బన్ ఫైబర్ సూట్ ధరించడంతో కొంతమేర దాని పట్టు నుంచి రక్షణ కలిగింది. అయితే, అనకొండ తన బలమైన దవడలతో అతడి తలను మింగేయడం ప్రారంభించింది.

Eaten alive ratings: 4.1 million viewers watch Paul Rosolie get not eaten by Anaconda

కొందరు దీన్ని అభినందించగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. పెటా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కార్యక్రమాన్ని ప్రసారం చేసిన డిస్కవరీ చానల్ మాత్రం పాముకు ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేసింది. పెటా విమర్శలపై వ్యాఖ్యానించడానికి డిస్కవరీ చానల్ వర్గాలు నిరాకరించాయి.

ఇతను అంతరించిపోతున్న అడవులపై అవగాహన కల్పించడానికి ప్రాణాల్నే పణంగా పెట్టాలనుకున్నాడు. ఈ సాహసానికి సంబంధించిన వివరాలన్నీ పాల్‌ మాటల్లో.. 'అంతరించిపోతున్న సతత హరితారణ్యాలపై అవగాహన కల్పించాలనుకున్నా.. అందరి దృష్టినీ అటువైపు మరల్చాలనుకున్నా. అందుకే పాము పొట్టలోకి వెళ్లే ధైర్యం చేశా. ప్రత్యేకంగా రూపొందించిన ఫైబర్‌ సూట్‌ని తెప్పించుకున్నా.

అమెజాన్‌ అడవుల్లో ఈ సాహసానికి అనువైన అనకొండ కోసం గాలించా. అందుకు 60 రోజులు సమయం పట్టింది. 20 అడుగుల పొడవున్న ఒక అనకొండ కనిపించింది. ఇక సాహసానికి సిద్ధపడ్డా. ప్రాణాలతో చెలగాటమే... ఏదైనా పొరపాటు జరిగితే..? ఆ ఊహ నన్ను కొంచెం భయపెట్టింది. ఫైబర్‌ సూట్‌ ధరించి ధైర్యంగా ముందడుగేశా. కొండచిలువ నోట్లో తలపెట్టా. తిన్నగా దాని పొట్టలోకి వెళ్లి ఒక గంటపాటు ఉండిపోయా.

అక్కడినుంచి బయటివారితో మాట్లాడే ఏర్పాటు చేసుకుని మరీ వెళ్లాను. మొత్తానికి క్షేమంగా బయటకు వచ్చేశా'' అంటూ తన అనుభవాన్ని వివరించాడు. అయితే ఆ అనకొండ పొట్టనుంచి బయటికి ఎలా వచ్చాడనే విషయాన్ని మాత్రం పాల్‌ వెల్లడించలేదు. పాము కూడా క్షేమంగా ఉందని పాల్‌ తెలిపాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+