తెరపైకొచ్చిన హమాస్, హెజ్బొల్లా
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా సయ్యద్ ఇబ్రహీం రైసీ అల్- సదటి కన్నుమూశారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో తుదిశ్వాస విడిచారు. ఇబ్రహీ రైసీతో పాటు మరో తొమ్మిది మంది ఈ దుర్ఘటనలో దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఉన్నారు.వాళ్లు ప్రయాణిస్తోన్న బెల్ 212 రకానికి చెందిన హెలికాప్టర్ పెను ప్రమాదానికి గురైంది. ఇరాన్- అజర్‌బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ఇరాన్ హోం మంత్రి అహ్మద్ వహీదీ తెలిపారు.
ఇబ్రహీ రైసీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ హొస్సైన్ అమీరబ్దుల్లాహియాన్, అయతొల్లా సయ్యద్ ముహమ్మద్ అలీ అల్-హషెమ్, డాక్టర్ మాలిక్ రహ్మతి, సర్దార్ సయ్యద్ మెహదీ మౌసవి, అన్ అనసర్ అల్-మెహదీ కార్ప్స్, పైలెట్, కో పైలెట్, కృఛేవ్ అనే వ్యక్తి మరణించారు.ఇబ్రహీం రైసీ స్థానంలో ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా ముహమ్మద్ ముఖ్బార్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం ఆయన ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్నారు. ఆయన నియామకానికి సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తయింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమేనీ ఆమోదం తెలపాల్సి ఉంది.

కాగా- ఇబ్రహీ రైసీ మృతి పట్ల హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులు సంతాపం తెలియజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇజ్రాయెల్‌ను తమ శతృదేశంగా భావించే ఈ రెండు గ్రూపులు కూడా ఇరాన్‌తో సుదీర్ఘకాలంగా అసోసియేట్ అయి ఉన్నాయి.రైసీ మరణించినట్లు అధికారిక ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే వేర్వేరుగా సంతాపం తెలియజేశాయి ఈ రెండు మిలిటెంట్ గ్రూపులు. రైసీని ఇస్లామిక్ విప్లవజ్యోతిగా, అత్యున్నత నాయకుడిగా, మహోన్నతుడిగా అభివర్ణించాయి. ఇబ్రహీం రైసీ, విదేశాంగ శాఖ మంత్రి హొస్సైన్ దుర్మరణం దురదృష్టకరఘటనగా పేర్కొన్నాయి.
ఇరాన్ ప్రజలకు తమ సంతాపాన్ని తెలియజేస్తోన్నామని, వారి ఆవేదనను పంచుకుంటోన్నామని వెల్లడించాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు తమ పూర్తి సంఘీభావాన్ని తెలియజేశాయి. ఇరాన్ పునరుజ్జీవనంలో రైసీ కీలక పాత్ర పోషించాడని, అత్యంత శక్తిమంతంగా తన దేశాన్ని మలచగలిగారని చెప్పారు.,పాలస్తీనా అథారిటీ, జియోనిస్ట్ అస్తిత్వానికి వ్యతిరేకంగా, ప్రజల తరఫున న్యాయబద్ధమైన పోరాటానికి రైసీ ఇన్నాళ్లూ అండగా నిలిచారని గుర్తు చేశాయి. పాలస్తీనా ఉద్యమానికి ఆయన మద్దతు పలికారని, గాజా స్ట్రిప్ వాసుల చిరకాల వాంఛను నెరవేర్చడానికి అవిశ్రాంతంగా కృషి చేశారని పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications