8రోజుల రిమాండ్: మాజీ భార్య కోసం విమానం హైజాక్

కైరో: మాజీ భార్య కోసం ఈజిప్టు విమానాన్ని హైజాక్ చేసిన ఆ దేశ పౌరుడు సైఫ్ అల్ దిన్ మహమ్మద్ మొస్తాఫాను సైప్రస్ న్యాయస్థానం ఎనిమిది రోజులు రిమాండ్‌కు తరలిస్తూ తీర్పును వెలువరించింది. లార్నాక కోర్టులో పోలీసులు అతడిని బుధవారం ప్రవేశపెట్టారు.

కోర్టులో నిందితుడు పెదవి విప్పకపోవడంతో ఈ కేసుకు ఉగ్రవాదంతో సంబంధం లేదని సైప్రస్ పోలీసు ఉన్నతాధికారులు న్యాయమూర్తి ఎదుట వెల్లడించారు. మొస్తాఫా మానసస్థితి సరిగా లేకపోవడం వల్లే విమాన హైజాకింగ్‌‌కు పాల్పడినట్లు వెల్లడించారు.

 Egyptian hijack suspect ordered held for 8 days

వివరాల్లోకి వెళితే మంగళవారం (మార్చి 29)న ఉదయం 7 గంటల సమయంలో అలెగ్జాండ్రియా నుంచి ఈజిప్టు రాజధాని కైరో బయల్దేరిన ఈజిప్టు ఎయిర్ ప్లైట్ 181 విమానాన్ని హైజాక్ చేసిన ఇతడు నకిలీ బాంబు బెల్టుతో విమానాన్ని సైప్రస్‌లోని లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు.

ఇది ఇలా ఉంటే ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా తమ జాతీయుడైన మొస్తాఫాను తమకు అప్పగించాలని సైప్రస్‌ దేశాన్ని ఈజిప్టు కోరింది. ప్రస్తుతం మొస్తఫాతో కలిసి ఓ బ్రిటన్ వాసి నవ్వుతూ తీసుకున్న సెల్ఫీ చిత్రం ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

 Egyptian hijack suspect ordered held for 8 days

విమానం హైజాక్‌కు గురైనప్పుడు 26ఏళ్ల బెంజమిన్ ఇన్నిస్ మీడియాతో మాట్లాడుతూ మొస్తాఫా నడుముకు చుట్టూ ఉన్నవి బాంబులనే అనుకున్నానని చెప్పాడు. దీంతో ప్రతికూల పరిస్థితుల్లో సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు.

వెంటనే వెళ్లి అతడితో ఓ సెల్ఫీ దిగాలని ఉందని చెప్పానని, అందుకు అతడు అంగీకరించడంతో వెంటనే అతడితో సెల్ఫీ దిగానని తెలిపాడు. కాగా మొస్తఫా అలెగ్జాండ్రియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అతడిని కొన్నాళ్ల కిందట భార్య వదిలేసింది. దీంతో ఆతడు తన భార్యను తీసుకొచ్చి చూపించాలని విమానాన్ని హైజాక్ చేసినట్టు పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+