మొసలిపై గజరాజు ప్రతాపం: నీటిలో తొక్కి, చంపేసిన వైనం.. ఎక్కడ అంటే
స్థాన బలం ముఖ్యం.. అవును నీళ్లలో మొసలిని ఎదురించలేం.. పులి, సింహాం, గజరాజు ఏనుగు అయినా అంతే సంగతులు. దీనికి సంబంధించి వేమన పద్యం కూడా ఉంది. అదే స్థాన బలం అని.. ఏనుగు బలం కూడా పనిచేయదని వివరించారు. కానీ ఆ పద్యం.. తప్పని రుజువు చేసింది ఓ గజరాజు. తన పిల్ల ఏనుగుపై దాడి చేసింది. దీంతో తల్లి ఏనుగుకు ఎక్కడ లేని కోపం వచ్చింది. తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.

రివర్స్ అయ్యింది
వేమన పద్యం ఓ ఏనుగు విషయంలో రివర్స్ అయింది. నీళ్లలో వెయ్యి ఏనుగుల బలం ఉండే మొసలిని దాని అడ్డాలోకే వెళ్లి.. ఓ ఏనుగు అంతు చూసింది. తన సంతానాన్ని కాపాడుకునేందుకు నీళ్లలో దిగి మొసలిని కాలితో తొక్కి చంపింది. ఆ మొసలి అంతు చూడనిదే గజరాజు ఊరుకోలేదు. ఆఫ్రికాలోని సఫారీ పార్కులో ఘటన జరిగింది. రెండు నెలల క్రితం ఘటన జరగగ తాజాగా వైరల్ అవుతోంది.

పిల్ల ఏనుగు
నీళ్లు తాగడానికి తన పిల్లలతో కలిసి ఏనుగు నదిలోకి దిగింది. అక్కడే మాటు వేసి ఉన్న మొసలి.. ఏనుగు పిల్లను పట్టేందుకు ప్రయత్నించింది. అదే చేసిన పాపమైపోయింది. ఒక్కసారిగా మొసలిపై తల్లి ఏనుగు దాడి చేసింది. తన తొండం, కాలితో మొసలి ప్రయత్నాన్ని అడ్డగించించింది. తొక్కి తొక్కి మరీ చంపేసింది. దీనిని అక్కడ ఉన్న కొందరు వీడియో తీశారు. గజరాజు కోపాగ్నిని చూసి.. వావ్ అని కామెంట్ చేశారు. వారి మాటలు వీడియోలు కూడా రికార్డు అయ్యాయి. కానీ తల్లి ఏనుగు మాత్రం మొసలి చచ్చిందని నిర్ధారించుకున్న తర్వాతనే బయటకు వచ్చింది.

వింతగా
ఇదీ కలికాలం.. ఏమైనా జరగొచ్చు.. కానీ మొసలికి నీటిలో బలం ఎక్కువ అని అందరూ అంటుంటారు. పెద్దలు చెప్పగా మనం విన్నాం కూడా. అయితే ఓ మొసలి మాత్రం ఎదురించలేకపోయింది. గజరాజు చేతిలో ఓడిపోయింది. అయితే మరికొందరు మాత్రం అక్కడ నీరు తక్కువగా ఉందని అంటున్నారు. నది, చెరువులో అయితే పరిస్థితి వేరేగా ఉండేదని కామెంట్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా.. మొసలిని గజరాజు నీటిలోనే మట్టి కరిపించింది. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications