ఊబకాయాన్ని తగ్గించే మెడిసిన్ వచ్చేసింది.. భారత్ లో ధర ఎంతంటే..?
ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా ఊబకాయం సమస్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది. గతంలో 40, 50 ఏళ్ల వయసు వారికి ఊబకాయం వచ్చేది. కానీ ఇప్పుడు పదేళ్లలోపు పిల్లల్లోనూ ఈ సమస్య తీవ్ర తరమైంది. దీనికి కారణం ఆహార నియంత్రణ లేకపోవడమేనని నిపుణులు అంటున్నారు. అయితే తాజాగా అధిక బరువును తగ్గించే మెడిసిన్ 'మౌంజారో' భారత్ మార్కెట్లోకి ప్రవేశించింది.

ప్రముఖ ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ ఈ మెడిసిన్ ను తయారు చేసింది. ఇటీవల అమెరికాకు చెందిన యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఈ డ్రగ్ కు ఆమోదముద్ర వేసింది. Zepbound బ్రాండ్ పేరుతో అమెరికాలో ఈ మెడిసిన్ ను విక్రయిస్తున్నారు. ఊబకాయం, టైప్-2 డయాబెటిస్ తో బాధపడుతున్న రోగులకు ఈ మందును సూచిస్తున్నారు. అమెరికా, యూరోప్ దేశాల్లో మౌంజారో కు భారీగా డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఈ మౌంజారో మెడిసిన్ ను భారత్ మార్కెట్లలోకీ తీసుకొచ్చింది ఎలీ లిల్లీ సంస్థ.
భారత ప్రభుత్వం ఆమోదం
ప్రముఖ ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ రూపొందించిన ఈ మెడిసిన్ ను భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్ కు చెందిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండార్డ్స్ అండ్ కంట్రోల్ సంస్థ తాజాగా మౌంజారో మెడిసిన్ కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు మెడిసిన్ ధరను కూడా ప్రకటించింది. 5ఎంజీ ధర రూ. 4,375/- గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2.5 ఎంజీ ధరను రూ. 3,500/-గా ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో డయాబెటిస్, ఊబకాయం సమస్యలతో లక్షలాది మంది బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఈ మౌంజారో మెడిసిన్ వారికి ఉపశమనం కలిగిస్తోందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎలా వాడాలి..?
మౌంజారో మెడిసిన్ 15 ఎంజీ తీసుకుంటే 72 వారాల్లో అత్యధికంగా 21.8 కేజీలు తగ్గొచ్చు. ఇక 5ఎంజీ తీసుకుంటే 72 వారాల్లో 15.4 కేజీలు తగ్గొచ్చని నిపుణులు తెలిపారు.
మౌంజారో తో బరువు తగ్గాను..
ఈ మౌంజారో ఔషధం అధిక మోతాదులో తీసుకోవడంతో తాను వేగంగా బరువు తగ్గినట్టు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గతేడాది డిసెంబర్ లో చెప్పుకొచ్చారు. మౌంజారో అనేది తక్కువ దుష్ప్రభావాలను కలిగి ఉంది. చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని చెప్పారు. ప్రస్తుతం అనేక దేశాల్లో ఈ ఔషధానికి డిమాండ్ ఏర్పడింది.
-
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
ఈ "చామదుంపల బిర్యానీ" ముందు నాన్ వెజ్ బిర్యానీలు కూడా తక్కువే !! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications