సారీ చెప్పిన ఎలాన్ మస్క్.. ఎవరికి ? ఎందుకంటే ??
బడబాగ్నికి జడివానకి దోస్తీ.. విధిరాతకి ఎదురీదని దోస్తీ.. పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ...... ఈ సాంగ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కి ఏ రేంజ్ లో సెట్ అయ్యాయో.. అదే రేంజ్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ లకి కూడా అదే రేంజ్ లో సెట్ అయ్యింది. నిన్నా మొన్నటి వరకు పాలు, నీళ్లు లాగా కలసిపోయిన వీరిద్దరూ.. కొన్నిరోజులుగా ఉప్పునిప్పు లాగా వ్యవహరిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ వెంటే ఎలాన్ మస్క్ నడిచారు. అన్నీ తానై.. ట్రంప్ ఎక్కడికెళ్లినా కూడా మస్క్ తప్పనిసరిగా ప్రచారంలో పాల్గొనేవారు. ట్రంప్ పార్టీ అధికారం చేజిక్కించుకున్నతర్వాత కూడా మస్క్ కి ట్రంప్ అదే స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఏమైందో తెలియదు గానీ.. ట్రంప్ నిర్ణయాలను మస్క్ వ్యతిరేకించడం ప్రారంభించారు.

ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆ బిల్లుతో దేశం దివాలా తీయడం ఖాయమని.. అమెరికన్లు ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిని చేయాలని కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో ట్రంప్‌నకు సంబంధాలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. రీసెంట్ గా అయితే మస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నారా అనే అనుమానాలు సైతం వచ్చాయి.
ఈ మధ్య గ్యాప్ లో వారి ఇద్దరి మధ్య స్నేహం చెడిందని ప్రపంచ మీడియా కోడై కూసింది. దీంతో మస్క్‌కు చెందిన కంపెనీలు మార్కెట్‌లో భారీ పతనాన్ని కూడా చవిచూశాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. మరోవైపు ఈ వ్యవహారంపై ట్రంప్ వర్గం కూడా ఆలోచనలో పడి అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ట్రంప్ - మస్క్ మధ్య సయోధ్య కుదిరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఎలాన్ మస్క్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతోంది.
ట్రంప్‌పై పెట్టిన పోస్టులపై మస్క్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిపై తాను పెట్టిన పోస్టులు చాలా దూరం వెళ్లాయని.. ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఇప్పుడు మళ్లీ వీరు కలిసిపోయారని అమెరికా వర్గాలు పేర్కొంటున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగనుందో అని.
I regret some of my posts about President @realDonaldTrump last week. They went too far.
— Elon Musk (@elonmusk) June 11, 2025












Click it and Unblock the Notifications