మస్క్ కు మరో సంతానం..? ఇప్పటికే 14 మంది పిల్లలు..!
ఎవరైనా తమ వ్యాపారాన్ని విస్తరింపజేస్తారు. కానీ స్పేస్ ఎక్స్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మాత్రం తన వ్యాపారంతోపాటు సంతానాన్ని విస్తరింపజేస్తున్నారు. ఇప్పటికే 14 మంది పిల్లలకు తండ్రయ్యారు మస్క్. అయితే తాజాగా మరో బిడ్డకు మస్క్ తండ్రి అయినట్లు సమాచారం. దీంతో ఆయన సంతానం 15కు చేరింది.
ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్(53) మరోసారి తండ్రి అయ్యారు. ఆయన తండ్రి కావడం ఒకటోసారో లేదా రెండోసారో కాదు.. ఏకంగా ఇది 15వ సారి. ఇప్పటికే ఆయనకు 14 మంది పిల్లలు ఉన్నారు. తాజాగా మరొకరు జన్మించడంతో ఆయన సంతానం సంఖ్య ప్రస్తుతం 15 వద్ద కొనసాగుతోంది. తాను ఓ జపనీస్ పాప్ స్టార్ రిలేషన్ షిప్ లో ఉండటం వల్ల ఆమె తాజాగా ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు మస్క్ పేర్కొన్నట్లు సమాచారం.
జపాన్ కు చెందిన పాప్ స్టార్ తో కలిసి ఎలాన్ మస్క్ తాజాగా మరో సంతానాన్ని కలిగినట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన నివేదికలో స్పష్టం అయింది. పాప్ స్టార్ ఆశ్లే క్లెయిర్ తో రిలేషన్ షిప్ కారణంగా మస్క్ మరో బిడ్డకు తండ్రి అయినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఇప్పటికే మస్క్ కు 14 మంది సంతానం ఉంది. వేరువేరు మహిళలతో మస్క్ ఈ సంతానాన్ని కలిగి ఉన్నారు. అంతేకాక ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇంకా సంతానం కావాలని ఎవరికైనా తన వీర్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ సంస్థ పేర్కొంది.

మరోవైపు మస్క్ తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో తన రిలేషన్ షిప్ కు వీడ్కోలు పలికారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(DOGE)వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ విభాగానికి మస్క్ ను అధిపతిగా నియమించారు. అయితే ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల కారణంగా మస్క్.. డోజ్ నుంచి వైదొలిగారు.
అయితే తాజాగా ట్రంప్.. మస్క్ కు ఫేర్ వెల్ పార్టీ ఇచ్చారు. అమెరికాలోని అధికారిక ఓవల్ ఆఫీస్ లో ఫేర్ వెల్ పార్టీ ఘనంగా జరిగింది. ఈ మీటింగ్ లో మస్క్ సేవలను ట్రంప్ కొనియాడారు. తమ ప్రభుత్వానికి మస్క్ కృషి చేశారని తెలిపారు. ఈ మేరకు మస్క్ కు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు
-
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఖమేనీ సంధి ఒప్పందం? -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం











Click it and Unblock the Notifications