ఉద్యోగులను రోడ్డున పడేస్తోన్న అపర కుబేరుడు: భారీగా కోత- లిస్ట్ రెడీ..!!

వాషింగ్టన్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ట్విట్టర్‌లో పెను సంచలనాలు నమోదవుతున్నాయి. ఒక దాని వెంట ఒకటిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. కార్పొరేట్ సెగ్మెంట్ మొత్తం నివ్వెరపోయేలా నిర్ణయాలను తీసుకుంటోన్నారు ఎలాన్ మస్క్. ఇన్నేళ్లు సజావుగా సాగుతూ వచ్చిన ట్విట్టర్ కార్యకలాపాల్లో భారీ కుదుపులు సంభవిస్తోన్నాయి.

టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఇంటిదారి..

టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఇంటిదారి..

ఈ పరిణామాల తరువాత ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గుడ్‌బై చెప్పనున్నారు. ట్విట్టర్.. ఎలాన్ మస్క్ చేతికి వెళ్లిన నేపథ్యంలో తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు లీగల్, పాలసీ చీఫ్ విజయ గద్దె కూడా తప్పుకోనున్నారు. ట్విట్టర్ జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్గెట్ సైతం కంపెనీని వీడనున్నారు. 2012 నుంచీ సీన్ ఎడ్గెట్.. ట్విట్టర్‌లో కొనసాగుతున్నారు.

క్షీణించిన ఆదాయం..

క్షీణించిన ఆదాయం..

అదే సమయంలో- అమెరికాకు చెందిన మల్టీనేషనల్ ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ జనరల్ మోటార్స్.. కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ట్విట్టర్‌కు ఇచ్చే వాణిజ్య ప్రకటనలను బంద్ చేయనున్నట్లు తెలిపింది. మిచిగాన్ స్టేట్‌ డెట్రాయిట్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోన్న లార్జెస్ట్ ఆటోమేకర్ కంపెనీ ఇది. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీకి కాంపిటీటర్‌గా గుర్తింపు ఉంది.

ఉద్యోగుల తగ్గింపు..

ఉద్యోగుల తగ్గింపు..

ఇప్పుడు తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు ఎలాన్ మస్క్. ట్విట్టర్‌లో పని చేసే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. ఉద్యోగాల్లో కోత పెట్టాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన జాబితాను సిద్ధం చేయాలంటూ మేనేజర్లకు సూచించారు. టెక్నికల్, సేల్స్, ప్రొడక్ట్స్, అడ్వర్టయిజ్‌మెంట్, లీగల్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఉద్యోగుల సంఖ్యను కుదించాలంటూ ఆయా విభాగాల మేనేజర్లందరికీ మెయిల్ పంపించారు.

నవంబర్ 1తేదీలోగా

నవంబర్ 1తేదీలోగా

ఒక్కరోజు వ్యవధిలో అంటే నవంబర్ 1వ తేదీలోగానే ఉద్యోగులను తొలగించేలా ఎలాన్ మస్క్ చర్యలు తీసుకున్నారని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఎంతమందిని తొలగిస్తారనేది తెలియరాలేదని తెలిపింది. ట్విట్టర్‌లో 7,500 మంది ఉద్యోగులు పని చేస్తోన్నారని, వారిలో 30 శాతం మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఆదాయం తగ్గుతోందా?

ఆదాయం తగ్గుతోందా?

ఇదివరకే జనరల్ మోటార్స్ ట్విట్టర్‌కు యాడ్స్ ఇవ్వడాన్ని నిలిపివేసిన నేపథ్యంలో సంస్థ ఆదాయం తగ్గుముఖం పట్టొచ్చని యూఎస్ మీడియా అభిప్రాయపడుతోంది. జనరల్ మోటార్స్ తరహాలోనే ఫోర్డ్ మోటార్స్, స్టెల్లాంటిస్, వేమోకు చెందిన ఆల్ఫాబెట్ కూడా ట్విట్టర్‌కు ఇచ్చే తమ వాణిజ్య ప్రకటనలను నిలిపివేయొచ్చనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే- వాణిజ్య ప్రకటనల రూపంలో ట్విట్టర్‌కు అందే ఆదాయానికి భారీగా గండిపడినట్టే అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+