ఎలాన్ మస్క్ సంచలన పోస్టు.. అమెరికాలో కొత్త పార్టీ ప్రకటన..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ కు మద్దతుగా మస్క్ ప్రచారం చేశారు. బహిరంగ సభల్లో ట్రంప్ ను అభినందిస్తూ ప్రసంగాలు చేశారు. కానీ ఇటీవల ట్రంప్ తీసుకొచ్చిన ది బిగ్ అండ్ బ్యూటిపుల్ బిల్లుపై ఎలాన్ మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పరిపాలన సౌలభ్యం కోసం ట్రంప్ తీసుకొచ్చిన డోజ్ వ్యవస్థ నుంచి కూడా మస్క్ వైదొలిగి షాక్ ఇచ్చారు.

ట్రంప్, మస్క్ మధ్య వైరం ముదురుతోంది. ఇటీవల రిపబ్లికన్స్ తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లుతో ఇరువురి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ట్రంప్ తీసుకొచ్చిన ఈ బిల్లు కారణంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య బంధం తెగిపోయినట్లు గానే భావించవచ్చు. అయితే తాజాగా ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా ఓ పోల్ పెట్టారు. తాను రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు హింట్ ఇచ్చారు మస్క్.

ఎలాన్ మస్క్ ఇటీవల ఎక్స్ వేదికగా పెట్టిన ఓ పోల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ పోల్ లో మస్క్.. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టే సమయం ఆసన్నమైంది అని రాసుకొచ్చారు. 80 శాతం మంది కోసం ఈ పార్టీ అవసరం అని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో త్వరలో అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని చూడబోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Elon Musk s Bombshell Calls for New US Political Party to Represent the Middle

మరికొంత మంది కామెంట్స్ చేస్తూ మాకు మధ్యలో ఈ కొత్త రాజకీయ పార్టీ అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఉన్నారని.. ఈ రెండు నచ్చనివారికి లిబర్టేరియన్ పార్టీ కూడా ఉంది. ఇప్పుడు నువు మళ్లీ కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం లేదని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరికొంతమంది మాత్రం మీరు ట్రంప్ తోనే ఉండాలని.. ఆయనతో కూర్చుని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచనలు చేశారు. అయితే ఈ కామెంట్స్ పై ఎలాన్ మస్క్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోవైపు మస్క్ కు చెందిన స్టార్ లింక్ కంపెనీ.. మనదేశంలో శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు స్టార్ లింక్ కు భారత టెలికాం విభాగం లైసెన్సు ఇచ్చింది. దీంతో ఈ లైసెన్స్‌ పొందిన మూడో కంపెనీగా స్టార్‌ లింక్‌ నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+