Elon Musk:బైడెన్ ప్రభుత్వం పై మస్క్ సంచలన ఆరోపణలు..!!

వాషింగ్టన్: స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. బైడెన్ ప్రభుత్వం కావాలనే నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసిందని ఆయన ఆరోపించారు. తమ సంస్థ రెస్క్యూ మిషన్ ను నెలల క్రితమే ప్రతిపాదించినప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోలేదని మస్క్ విమర్శించారు.

X (ట్విట్టర్) వేదికగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్లిన వ్యోమగాములు, వైట్ హౌస్ జోక్యంతో ఎనిమిది నెలలకు పైగా కక్ష్యలోనే చిక్కుకుపోయారని ఆయన పేర్కొన్నారు. "స్పేస్‌ఎక్స్ మరో డ్రాగన్‌ను పంపి, 6 నెలల క్రితమే వారిని తిరిగి తీసుకురాగలిగేది. కానీ బైడెన్ వైట్ హౌస్ దానిని అనుమతించలేదు" అని మస్క్ ఆరోపించారు.

Elon Musk says Biden admin left the astronauts stranded for 8 months

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకుని, వారిని వెంటనే తిరిగి రప్పించాలని ఒత్తిడి చేశారని మస్క్ తెలిపారు. సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ బోయింగ్ స్టార్‌లైనర్‌లో జూన్ 6, 2024 న ISS కి చేరుకున్నారు. అయితే, ఆ వ్యోమనౌక తిరిగి ప్రవేశించడానికి సురక్షితం కాదని నాసా నిర్ధారించడంతో వారి తిరుగు ప్రయాణం నిరవధికంగా వాయిదా పడింది. ప్రస్తుతం, వారు స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్‌లో తిరిగి రానున్నారు.

మార్చి 12వ తేదీన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి క్రూ-10 స్పేస్ ఫ్లయిట్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు వెళ్లనుంది. ఇది అక్కడికి వెళ్లిన తర్వాత అందులోనే సునీతా విలియమ్స్ బృందం భూమికి చేరుకుంటుంది.అంతరిక్షంలో కొన్ని నెలల పాటు ఉన్న అనుభవాలను విల్మోర్ పంచుకున్నారు. అక్కడ ఇంతకాలం ఉండటాన్ని చక్కటి అనుభూతినిచ్చిందన్నారు. ఇక తిరిగి భూమికి చేరడం అనేది మరో సవాలుతో కూడుకున్నదని విల్మోర్ అన్నారు. అయిత సురక్షితంగా భూమికి చేరుకుంటామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

మొత్తానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన 8 రోజుల్లో తిరిగి రావాల్సిన వారు 8 నెలల వరకు అక్కడే ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. అంతేకాదు వీరిని నింగిలోకి మోసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ అనే అంతరిక్ష వాహన నౌక సేఫ్టీ పై కూడా ప్రశ్నలు తలెత్తాయి.స్పేస్ ఫ్లయిట్స్ పై తీసుకునే నిర్ణయాలు కూడా రాజకీయంగా దుమారం రేపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+