వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కప్పు కాఫీ, ఖర్జూరం ఇస్తే.. నా కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తా’

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

దుబాయ్: 'ఓ అరబిక్ కప్పు కాఫీ, ఒక ఖర్జూరం ఇస్తే చాలు. అదే కట్నం అనుకుంటా. నా కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తా' అంటూ ఎమిరేట్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రకటించాడు. వివరాల్లోకి వెళితే... ఎమిరేట్‌లోని అల్ ఐన్‌కు చెందిన ఓ అరబ్ షేక్ తన ఆరుగురు కూతుళ్లకు పెళ్లి చేయాలని నిర్ణయించాడు.

ఎమిరేట్ దేశ చట్టాల ప్రకారం అక్కడ అమ్మాయిలకు ఎదురు కట్నం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కట్నం కూడా దిర్హమ్స్‌లో ఉండటం విశేషం. దీంతో తన కూతుళ్లకు పెళ్లి చేసేందుకు అంత మొత్తాన్ని ఇవ్వలేని చాలా మంది అరబ్ షేకులు వేరే దేశాలకు చెందిన వారిని పెళ్లి చేసకుంటూ ఉంటారు.

Emirati Father offers Huge Dowry to Marry His Daughter Like No One: A Cup of Arabic Coffee and Dates

అయితే ఈ అరబ్ షేక్ మాత్రం వినూత్నంగా ఒక అడుగు ముందుకేసి ఈ ప్రకటన చేశాడు. అంతేకాదు వేరే దేశాలకు చెందిన వారిని పెళ్లిళ్లు చేసుకుంటున్ నేపథ్యంలో అలాంటి పెళ్లిళ్లను తగ్గించడానికి అల్ ఐన్‌కు చెందిన ఇతడు ఓ కప్పు అరబిక్ కాఫీ, ఓ ఖర్జూరం ఇస్తే బంగారం లాంటి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానంటూ ప్రకటన ఇచ్చాడు.

గల్ఫ్ న్యూస్ పేపర్ ప్రకటించిన ఈ వార్తా కథనంపై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే అమ్మాయిలకు ఎదురు కట్నం ఇచ్చే సంప్రదాయం నుంచి ఎమిరేట్ యువకుల బాధలను తగ్గించేందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్ జయూద్ కట్నంపై కొన్ని నిబంధనలను విధించింది.

ఎమిరేట్ దేశంలో పెళ్లి కూతురుకు ఇచ్చే కట్నం 5400 డాలర్ల నుంచి 8100 డాలర్లలోపు మాత్రమే ఉండాలని ఆదేశించారు. అంతేకాదు ఈ తరహా పెళ్లిళ్లపై ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ పెద్ద చర్చే కొనసాగించింది. ఇదే విధంగా ప్రజాస్వామ్యానికే ముప్పుగా పరిణమిస్తుందన్నారు.

English summary
The Emirati Father of six daughters who lives in Al Ain is all set for dowry, but only with Qahwa (a Cup of Arabic Coffee and Dates).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X