ఇదేమీ విచిత్రం: విమానంలో ప్యాసెంజర్ ఒక్కరే.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
ఆప్ఘన్‌లో తాలిబాన్ల ఆటవిక పాలన కొనసాగుతోంది. దీంతో అక్కడ ఉండలేక వెళ్లేందుకు జనం విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఓ విమానంలో దాదాపు 600 మంది పైచిలుకు ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటపడేందుకు కాబూల్ విమానాశ్రయానికి ఇటీవల వేలాదిమంది వచ్చారు. విమానం రెక్కలపై కూర్చుని అయినా దేశం దాటాలని ప్రయత్నించి ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోటెత్తిన జనాన్ని అడ్డుకునేందుకు జరిపిన కాల్పుల్లో మరికొందరు బయలుదేరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి.
వేలాదిమంది విమానాశ్రయం బయట ప్రతి రోజూ పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే రాయల్ మెరైన్‌కు చెందిన యూకే మాజీ కామాండో పాల్ 'పెన్' ఫార్తింగ్ తన భార్య కైసాను ఖాళీ విమానంలో తరలించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనే ఈ ఫొటోలను షేర్ చేశారు. ఆమె ప్రయాణించిన 'సి-11 గ్లోబ్‌మాస్టర్' మిలటరీ విమానం ఖాళీగా ఉంది.

ఫొటోను ట్వీట్ చేసిన ఆయన.. ఎయిర్‌పోర్టు బయట వేలాది మంది లోపలికి రాలేక నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విమానం నిండినా, నిండకున్నా ప్రతీ గంటకు టేకాఫ్ అవాల్సిందేనని పరిస్థితిని వివరించారు. కానీ అర్థం మాత్రం మరోలా వెళ్లింది. మిషన్ పూర్తయ్యాక వీరిని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి ఉంటుందని అన్నారు. త్వరలో చాలా భయంకరమైన సన్నివేశాలు చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాశ్చాత్య ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాల్.. కాబూల్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అన్నారు.
ఇటీవల అమెరికా కార్గో విమానంలో 640 మంది ఆఫ్ఘన్లు కిక్కిరిసి కూర్చుని దేశం దాటుతున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రజలు దేశం నుంచి బయటపడేందుకు తంటాలు పడుతున్న వేళ వారిని తప్పించుకునేందుకు పాల్ జంట విమానంలో రాత్రిపూట ఒంటరిగా వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. ఇది చాలా దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నెటిజన్లు కోరుతున్నారు. పెన్‌పై చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తుండగా, ఆయన ఎందుకలా వెళ్లాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించి కారణం చెప్పగలరా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ చాలా మంది మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Kaisa is on her way home! BUT this aircraft is empty…scandalous as thousands wait outside #Kabul airport being crushed as they cannot get in Sadly people will be left behind when this mission is over as we CANNOT get it right 💔@SecDef @VP @cnnbrk @BBCBreaking @SkyNews @itvnews pic.twitter.com/FoAxFrzT1K
— Pen Farthing (@PenFarthing) August 19, 2021
Mr @BWallaceMP why is this plane leaving Kabul without passengers? Please for goodness sake, give us a good reason...why?!
— Julie Smyth 💙 (@Julie_A_Smyth) August 19, 2021
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications