వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇమ్రాన్ ఖాన్‌కు అంత సీన్ లేదు.. పరువు తీసిన పాక్ ప్రధాని మాజీ భార్య రెహన్ ఖాన్

|
Google Oneindia TeluguNews

రాజకీయ సంక్షోభంతో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను గద్దెదింపేందుకు పార్లమెంటులో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇప్పటివరకూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వచ్చిన భాగస్వామ్య పార్టీలు కూడా కూటమి నుంచి బయటకు వచ్చేశాయి. దీంతో ఇమ్రాన్‌కు పదవి గండం తప్పదని సంకేతాలు వెలువడుతున్నాయి. పార్లమెంటులో అశిశ్వాస తీర్మానం నెగ్గాలంటే కనీసం 172 మంది అవసరం . కానీ ఇమ్రాన్ ఖాన్ సర్కార్‌కు 168 మంది మద్దతు మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.

ఇమ్రాన్‌కు మాజీ భార్య చుర‌క‌లు

మరోవైపు ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్‌ను పరిపాలించే సామర్థ్యం, తెలివి తేటలు ఆయనకు లేవని విమర్శలు గుప్పించింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు గత చరిత్ర అంటూ చురకలు అంటించింది. నయా పాకిస్థాన్ పేరు చెప్పి దేశాన్ని భ్రష్టుపట్టించారని ట్విట్లర్ వేదికగా దుయ్యబట్టింది. దేశంలో పేర్చిన చెత్తను శుభ్రం చేయాల్సిన సమయం అసన్నమైందన్నారు. దీనికోసం మ‌నందరం కలిసికట్టుగా పనిచేయాలని ప్ర‌జ‌ల‌కు పిలుపు నిచ్చారు.

అస‌మ‌ర్థ‌పు ప్ర‌ధాని

అస‌మ‌ర్థ‌పు ప్ర‌ధాని


ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కానప్పుడే పాకిస్థాన్ ఉన్నతంగా ఉందని రెహమ్ ఖాన్ ఎద్దేవా చేశారు. 2018లో నయా పాకిస్థాన్ ను నిర్మిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టింది. కానీ ప్రజల సాదారణ సమస్యలను కూడా పరిష్కరించలేకపోయిన అసమర్థుడని విమర్శించింది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ను పరిపాలించే అర్హత ఇమ్రాన్‌కు లేదన్నారు.

ప‌ద‌వి గండం త‌ప్ప‌దు..

ప‌ద‌వి గండం త‌ప్ప‌దు..

ఇమ్రాన్ ఖాన్ పదవి గండం తప్పదని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఆయన మరో ప్రత్యామ్నాయ మార్గంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పార్లమెంటును రద్దే చేసే యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్‌కు ఓటమి తప్పదని దాదాపు ఖాయమైంది. ఇమ్రాన్ దిగిపోతే ప్రతిపక్ష నేత , పీఎంఎల్ ఎన్ చీఫ్ షహబాబ్ షరీఫ్ పాకిస్థాన్ తదుపరి ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందంటూ జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పాల‌న‌లో ప్ర‌జ‌లు దుర్భ‌ర జీవితం గ‌డుపుతున్నార‌ని ప్ర‌తిపక్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

English summary
Ex wife Reham Khan slam Pakistan PM Imran Khan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X