అమెరికాపై దాడికి దిగిన ఇరాన్: కాన్సులేట్ ధ్వంసం

Joe Biden: మధ్య ఆసియా దేశాల్లో యుద్ధ మేఘాలు అలముకున్నాయి. ఇప్పటికే యెమెన్‌‌పై దాడికి దిగింది అగ్రరాజ్యం అమెరికా. హౌతి తిరుగుబాటుదారుల స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. బ్రిటన్ సహా వివిధ దేశాల సహకారంతో ఈ దాడులకు పూనుకుంది. సముద్ర మార్గాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న హౌతి రెబెల్స్‌పై ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది.

ఈ క్రమంలో అమెరికాపై దాడులకు సిద్ధపడింది ఇరాన్. ఇరాక్‌లో ఉన్న అమెరికన్ కాన్సులేట్ కార్యాలయ భవనంపై బాలిస్టిక్స్ మిస్సైళ్లను సంధించింది. ఇరాక్ ఉత్తరప్రాంతంలోని ఎర్బిల్ సిటీలో ఉంటుంది యూఎస్ కాన్సులేట్. దీన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఆరు మంది తీవ్రంగా గాయపడ్డారు. కాన్సులేట్ భవనం పాక్షికంగా ధ్వంసమైంది.

Explosions near US Consulate in Iraq, IRGS has taken responsibility for the attacks

ఈ దాడులకు తామే కారణమని ఇరానియన్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. దాడి చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది. ఎర్బిల్‌లోని అమెరికన్ కాన్సులేట్.. గూఢచర్య కార్యకలాపాలకు కేంద్రబిందువుగా మారిందని ఆరోపించింది. తమకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాల మద్దతును అమెరికా కూడగట్టుకుంటోందని పేర్కొంది.

ఈ ఘటనలో నలుగురు మరణించారని కుర్దిస్తాన్ రీజినల్ సెక్యూరిటీ కౌన్సిల్ తెలిపింది. గాయపడ్డ ఆరుమందికి అత్యవసర వైద్యాన్ని అందిస్తోన్నట్లు పేర్కొంది. మృతుల్లో అమెరికా అధికారులు గానీ, ఆ దేశ పౌరులు గానీ ఎవరూ లేరని వివరించింది. ఈ దాడిని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ దాడి తీవ్రతను అంచనా వేస్తోన్నామని, దీన్ని తిప్పి కొట్టక తప్పదనీ హెచ్చరించింది.

అమెరికన్ కాన్సులేట్‌పై దాడి అనంతరం ఇరాక్.. అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం ఈ భేటీ ఏర్పాటు కానుంది. ఇరాక్ భూభాగంపై దాడికి పాల్పడకూడదనే సెక్యూరిటీ అగ్రిమెంట్‌ను ఇరాన్ అధిగమించినట్టయిందని పేర్కొంది. దీని తరువాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+