Facebook: ఆ సిస్టమ్ పని చేయదిక: యాప్ నుంచి ఆ టెంప్లేట్ కట్: కోట్లాది యూజర్లపై ప్రభావం
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్.. మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యూజర్లు వినియోగిస్తోన్న ఓ సిస్టమ్‌ను శాశ్వతంగా తొలగించనుంది. ఆ సిస్టమ్‌ను నడిపించే బేసిక్ టెంప్లేట్‌ను ఫేస్‌బుక్ నుంచి డిలేట్ చేయనుంది. మొబైల్ వర్షన్, డెస్క్‌టాప్ వర్షన్, ట్యాబ్ వర్షన్.. ఇలా ఎందులోనూ ఆ సిస్టమ్ ఇకపై అందుబాటులో ఉండదు. భద్రతాపరమైన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా తెలిపింది.

ఫేస్ రికగ్నైషన్..
ఆ సిస్టమే- ఫేస్ రికగ్నైషన్. యూజర్ల ఫొటోలు, వీడియోలను ఆటోమేటిక్‌గా గుర్తించడానికి ఉపయోగ పడే వ్యవస్థ ఇది. దాన్ని శాశ్వతంగా డిలేట్ చేయనుంది. ఇప్పటిదాకా ఫేస్ రికగ్నైషన్ సిస్టమ్ గుర్తించిన ఫొటోలు, వీడియోలన్నీ కూడా డిలేట్ కానున్నాయి. ఫేస్ రికగ్నైషన్ ద్వారా ఐడెంటిఫై చేసిన కోట్లాదిమంది యూజర్ల ఫొటోలు, వీడియోలు ఇక కనిపించవు. ఈ తొలగింపును దశలవారీగా కొనసాగిస్తామని ఫేస్‌బుక్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ జెరోమ్ పెసెంటీ తెలిపారు.

సెక్యూరిటీ బ్రీచ్..
దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆయన అధికారిక బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఫేస్‌బుక్ యాజమాన్యం భద్రతా పరమైన అంశాలకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సెక్యూరిటీ బ్రీచ్ విషయంలో ఒకట్రెండు దేశాలు భారీగా జరిమానాలను సైతం విధించాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పైనే పూర్తిగా ఆధారపడటం వల్ల అస్థిరత్వానికి తెర తీసిందనే విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ పరిణామాల మధ్య దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ ఫేస్ రికగ్నైషన్ సిస్టమ్‌ను తొలగించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

రాజీధోరణి..
యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏర్పడిన సమయంలో ఫేస్‌బుక్ కొంత రాజీధోరణిని అనుసరిస్తోందని, ప్రైవసీని కాపాడే భద్రత వ్యవస్థలో క్రమంగా లోపాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఇదివరకు ఆరోపణలు వచ్చాయి. ఈ తరహా విమర్శలు, ఆరోపణలు ఒక్క ఫేస్‌బుక్ మాత్రమే కాదు.. కొన్ని సాఫ్ట్‌వేర్ బిగ్ షాట్స్ కూడా ఎదుర్కొన్నాయి. ఐబీఎం ఇప్పటికే ఫేసియల్ రికగ్నైషన్ ప్రొడక్ట్ సేల్స్‌ను శాశ్వతంగా నిలిపివేసింది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ కూడా ఇదే తరహా నిర్ణయాన్ని తీసుకున్నాయి.

వార్తల స్క్రూటినీ..
ఫేస్‌బుక్‌లో పబ్లిష్ అయ్యే వార్తలను కూడా స్క్రూటినీ చేస్తామని పెసెంటీ పేర్కొన్నారు. యూజర్ సేఫ్టీతో పాటు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై పెద్ద ఎత్తున అసభ్య పదాలతో నిండిన సమాచారం పోస్ట్ అవుతోందని గుర్తించడం వల్లే ఈ నిర్ణయం తీసుకోనున్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లలో మూడొంతుల మంది ఫేస్ రికగ్నైషన్ సెట్టింగ్స్‌ను ఆప్ట్ చేసుకున్నారని, ఇప్పుడు తాజాగా ఆ టెంప్లేట్‌ను తొలగించడం కోట్లాదిమందికి దీన్ని వినియోగించుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
Recommended Video

డిసెంబర్ నుంచి..
ఈ తొలగింపు ప్రక్రియ అనేది డిసెంబర్‌లో మొదలు పెట్టే అవకాశం ఉందని పెసెంటీ పేర్కొన్నారు. ఫేస్‌బుక్ యాజమాన్యం తీసుకన్న ఈ నిర్ణయం పట్ల ప్రైవసీ అడ్వొకసీ అండ్ డిజిటల్ రైట్స్ గ్రూప్స్ హర్షం వ్యక్తం చేస్తోన్నాయి. దీన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపాయి. ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్‌గా రికగ్నైషన్ కావడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని, ప్రైవసీకి భంగం వాటిల్లుతోందని ఎలక్ట్రానిక్ ప్రైవసీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలన్ బట్లర్ చెప్పారు. ఇప్పుడీ వ్యవస్థను తొలగించడం మంచి నిర్ణయమని వ్యాఖ్యానించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications