సంచలన ఆడియో లీక్: ఫేస్‌బుక్ సీఈఓ ఇంత పనిచేశాడా? ప్రెసిడెంట్ అభ్యర్థి ఫైర్

వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ పెద్ద చిక్కుల్లో పడ్డారు. జుకర్‌బర్గ్ తన ఉద్యోగులతో మాట్లాడిన అంతర్గత ఆడియో ఒకటి బహిర్గతం కావడం ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. డెమోక్రటిక్ అభ్యర్థి ఎలిజబెత్ వారెన్ అధ్యక్షరాలిగా ఎన్నికైతే ప్రమాదమని.. చట్టపరమైన సవాళ్లు ఎదురవుతాయని మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించినట్లు ఆ ఆడియోలో ఉంది.

అంతర్గత మాటలు లీక్..

అంతర్గత మాటలు లీక్..

మార్క్ జుకర్‌బర్గ్ తన సంస్థ ఉద్యోగులతో నిర్వహించిన అంతర్గత సమావేశంలో మాట్లాడిన మాటలు లీక్ అయ్యాయని, అందులో ఈ వ్యాఖ్యలు ఉన్నాయని ‘ది వెర్జ్' అనే మీడియా సంస్థ వెల్లడించింది. లీక్ అయిన ఆడియోలో మార్క్ జుకర్‌బర్గ్ ప్రధానంగా ఆరు అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. అమెరికా ప్రభుత్వం ఫేస్‌బుక్‌ను విచ్ఛిన్నం చేయడంతోపాటు వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌తో పోటీ పడాలనే తమ లక్ష్యాన్ని దెబ్బతీయాలని భావిస్తోందని తెలిపారు. అంతేగాక, ఎలిజబెట్ వారెన్ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే తమ సంస్థకు చట్టపరమైన ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు.

టిక్ టాక్ పై కీలక వ్యాఖ్యలు..

టిక్ టాక్ పై కీలక వ్యాఖ్యలు..

తామంతా కలిసి వీటిని తిప్పికొట్టగలమని ఉద్యోగులతో మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు. ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్ లాంటి దిగ్గజ టెక్ సంస్థలను ఆమె లక్ష్యంగా చేసుకుంటారని అన్నారు. ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా యువతలో ఎంతో క్రేజ్ పెంచుంటున్న చైనా కంపెనీ యాప్ టిక్‌టాక్‌పైనా మార్క్ జుకర్‌బర్గ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిక్‌టాక్‌ను ఎదుర్కొనేందుకు కొత్త వీడియో షేరింగ్ యాప్ లాసోను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నట్లు మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. అంతేగాక, ఫేస్‌బుక్ క్రిస్టో కరెన్సీ లిబ్రా గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ట్విట్టర్ మొత్తం ఆదాయం కంటే సెక్యూరిటీ కోసం ఫేస్‌బుక్ ఎక్కువ పెట్టుబడి పెడుతోందని వెల్లడించారు.

ఇలా చేస్తారా?

ఇలా చేస్తారా?

ఇది ఇలావుంటే, లీకైన ఆడియోలో మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై ఎలిజబెత్ వారెన్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి వారు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు ఎలాంటి తావులేకుండా ఫేస్‌బుక్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సమర్థవంతమైన పోటీదారులైన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను సొంతం చేసుకోవడం ద్వారా ఫేస్‌బుక్ మార్కెట్ ఆధిపత్యాన్ని సాధించిందని అన్నారు. అంతేగాక, 85శాతం కంటే నెట్ వర్కింగ్ ట్రాఫిక్‌.. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని సంస్థలకే వెళుతోందని ఆరోపించారు.

దురుద్దేశం లేదంటూ

దురుద్దేశం లేదంటూ

కాగా, తనపై వచ్చిన ‘వెర్జ్' కథనాన్ని మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని ఫేస్‌బుక్ ఖండించింది. ఫేస్‌బుక్ పేజీలో మార్క్ జుకర్‌బర్గ్ ఒక ప్రకటనను విడుదల చేశారు. జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు పూర్తిగా అంతర్గతమే అయినప్పటికీ.. ఆసక్తిగా ఉన్నవాళ్లు ఫిల్టర్ చేయని వీడియో వెర్షన్‌ను పరిశీలించుకోవచ్చని ఆ సంస్థ పేర్కొంది. ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+