వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను టీ షర్టులే ఎందుకు ధరిస్తానంటే..: జుకర్ బర్గ్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఎప్పుడూ టీ షర్టులోనే కనిపించే ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, సిఈఓ మార్క్ జుకర్‌ బర్గ్ అందుకు గల కారణాలను ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. అతడు ఎప్పుడూ రౌండ్‌నెక్ టీ షర్టుతోనే ఎక్కువ కనిపిస్తాడు.

తనకు దుస్తుల అంశంపై ఎక్కువగా సమయం గడపటం ఇష్టం వుండదని, అందుకే ఎక్కువగా టీ షర్టులనే వేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. వీటిలో కూడా ఎక్కువగా బూడిద రంగు టీ షర్టులే తన దగ్గర ఉన్నాయని చెప్పారు. అందుకే వాటినే ఎక్కువగా ధరిస్తానని వివరించారు.

తాను ఎప్పుడు సమాజానికి ఉత్తమ సేవలను ఏ విధంగా అందించాలనే ఆలోచనలతో గడుపుతానని చెప్పారు. తాను పొద్దున లేచినప్పటి నుంచి ఒక బిలియన్ ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలనే ఆలోచనతో ఉంటానని తెలిపారు. తన శక్తిని ఉత్తమ ఉత్పత్తులు, సేవలు అందించడానికే ఉపయోగిస్తానని చెప్పారు.

 Facebook's Mark Zuckerberg: Why I wear the same T-shirt every day

అంతేగాక జుకర్ బర్గ్ పలు విషయాలపై స్పందించారు. ఫేస్‌బుక్ వినియోగదారులు తప్పనిసరిగా మెసేంజర్‌ ఆప్‌ను ఎందుకు డౌన్‌లోడ్ చేసుకోవాల చెప్పారు. ఈ ఆప్ ద్వారా మొబైల్ వినియోగదారులు తొందరగా, సౌకర్యవంతంగా సందేశాలను పంపుకోవచ్చని చెప్పారు.

తన కంపెనీలో ఎక్కువగా మహిళా ఉద్యోగులకు అవకాశం ఇస్తున్నానని చెప్పారు. మహిళలు కూడా కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సులో చేరి ప్రతిభను చాటుకోవాలని అన్నారు. తన కంపెనీలోని ఉద్యోగులు ఒక కొత్త కంపెనీ పెట్టాలనుకుంటే తాను ఎంతో సంతోష పడతానని చెప్పారు. తన కంపెనీలో పని చేసే ఉద్యోగులకు అలాంటి సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఎందుకంటే తాను సిలికాన్ వ్యాలీకి వచ్చినప్పుడు కంపెనీలో ఎలా ప్రారంభించాలో తనకు తెలియదని చెప్పారు.

English summary
Facebook founder and chief executive Mark Zuckerberg has opened up about the controversial Messenger app, how Hollywood has hurt him and why he wears the same T-shirt every day, in his first-ever Q&A session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X